గత కొన్ని రోజులుగా తెలుగులో మంచి సినిమాలు వస్తున్నాయి. కమర్షియల్ సినిమాలని వదిలేసి కాన్సెప్ట్ సినిమాలతో వస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో చాలా కాన్సెప్ట్ సినిమాలు వస్తున్నాయి. అయితే అలా సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్న చిత్రం "ప్లే బ్యాక్". టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సుకుమార్ స్నేహితుడైన జక్కా హరిప్రసాద్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్ర టీజర్ నిన్న విడుదల అయింది. హరి ప్రసాద్ గతంలో "దర్శకుడు"అనే సినిమా తీసిన విషయం తెలిసిందే.

 


క్రాస్ టైమ్ కనెక్షన్ తో వస్తున్న ఈ చిత్ర టీజర్ చాలా కొత్తగా ఉంది. టీజర్ లాంచ్ చేసిన తర్వాత సుకుమార్ మాట్లాడుతూ, చిన్న సినిమాలు బాగా ఆడుతున్న రోజులివి. ఈ సినిమాలో పనిచేసిన అందరికి బెస్ట్ విషెస్ తెలువుతున్నాను. కమ్రాన్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలెట్ అవుతుంది. కెమెరామెన్ బుజ్జి తక్కువ టైమ్ లో బాగా తీశాడు. నేను చెయ్యలనున్న కథ ఈ ప్లే బ్యాక్, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది. హిట్ ఆయే ఎలిమెంట్స్ అన్ని ఈ సినిమాలో ఉన్నాయి. 

 

హరిప్రసాద్ కు ఈ సినిమా మంచి పేరు తెచ్చి పెడుతుంది అన్నారు. డైరెక్టర్ హరి ప్రసాద్ మాట్లాడుతూ… హీరో దినేష్ తేజ్ కష్టపడి చేశాడు, అనన్య కథ విని వెంటనే ఒప్పుకుంది. డిఫరెంట్ వెరీయేషన్స్ లో ఈ అమ్మాయి నటించింది. ఇంత పెద్ద కథను కేవలం 35 రోజుల్లో పూర్తి చేశానంటే దానికి కారణం కెమెరామెన్ బుజ్జి. సినిమా పూర్తి కావడానికి కారణమైన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను

 

ఈ టీజర్ లాంచ్ కి విచ్చేసిన సుకుమార్ కి థ్యాంక్స్ తెలుపుతున్నాను. సుకుమార్ నాకు తమ్ముడు లాంటి వాడు. నాకు గత ఇరవై ఐదు ఏళ్ళుగా సుకుమార్ తో పరిచయం ఉంది అని తెలిపాడు. కవిత పెద్దినేని సమర్పణలో ప్రసాద్ రావు పెద్దినేని నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దినేష్ తేజ్ హీరోగా నటిస్తుండగా, మల్లేశమ్ ఫేమ్ అనన్య నాగాళ్ల హీరోయిన్ గా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: