బాలీవుడ్ సినిమా పరిశ్రమకు బూమ్ అనే సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టిన అందాల నటి కత్రినా కైఫ్, ఆ తరువాత టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ సరసన మల్లీశ్వరి సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి పేరు సంపాదించింది. ఇక ఆ తరువాత వరుసగా బాలీవుడ్ అవకాశాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ, మధ్యలో యువరత్న బాలకృష్ణ సరసన అల్లరి పిడుగు అనే సినిమాలో కూడా నటించింది. ఇక ప్రస్తుతం ఎన్నో బాలీవుడ్ సూపర్ హిట్ సినిమాల్లో పలువురు స్టార్ హీరోల సరసన నటించి మంచి స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న కత్రినా

 

ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటూ, తన సినిమా మరియు వ్యక్తిగత విషయాలు కూడా వారితో పంచుకుంటుంటుంది. ఇక ఎక్కువగా తన ఫిట్ నెస్ పై ఎంతో శ్రద్ధ పెట్టే కత్రినా, నేడు తన సోషల్ మీడియా మాధ్యమం ఇన్స్టాగ్రమ్ లో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియో పోస్ట్ లో కత్రినా ఎంతో హెవీగా వెయిట్స్ ఎత్తడంతో పాటు తన సహచరులు మరియు ట్రైనర్ ఆధ్వర్యంలో పలు రకాల కసరత్తులు చేయడం గమనించవచ్చు. 

 

ఇక వీడియోలో ఎంతో కష్టపడుతూ కసరత్తులు చేస్తున్న కత్రినా ను చూసి పలువురు నెటిజన్లు మరియు ఆమె ఫ్యాన్స్, వామ్మో కత్రినా తన ఫిట్ నెస్ కోసం ఇంతలా కష్టపడుతుందా అంటూ ఆశ్చర్యంతో తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆమె పోస్ట్ చేసిన వీడియో పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. కాగా కత్రినా ప్రస్తుతం అక్షయ్ కుమార్ సరసన సూర్యవంశీ అనే సినిమాలో నటిస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియోపై ఒక లుక్ వేయండి........!!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

When @rezaparkview is in town u can always expect madnessssssss , @yasminkarachiwala and my workout partner rama returns 🌟 #flexagon

A post shared by Katrina Kaif (@katrinakaif) on

 

మరింత సమాచారం తెలుసుకోండి: