స్టార్ హీరోల మధ్య ఎలాంటి విభేదాలు.. పోటీ లేకపోయినా అభిమానులు మాత్రం నువ్వా నేనా అన్నట్టు వ్యవహరిస్తారు. ఫ్యాన్స్ అంటే.. నిర్మాతల మధ్యే పోటీ నెలకొంది. మహేశ్.. బన్నీ నిర్మాతలు అభిమానులు మధ్య కాంపిటీషన్ పెంచుతున్నారా? 

 

మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు.. బన్నీ అల వైకుంఠ పురములో మధ్య పోటీ ఇవాల్టిది కాదు. ఈ ఇద్దరి సినిమాలు సంక్రాంతికి వస్తాయన్న విషయాన్ని నిర్మాతలు ముందు నుంచీ చెబుతున్నారు. అయితే డేట్ రిలీజ్ చేయడంతో అసలు గొడవ మొదలైంది. 12 విడుదలంటూ.. ముందుగా అల వైకుంఠపురములో సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. ఇదొచ్చిన రెండు గంటలకే.. 12న రిలీజ్ అంటూ సరిలేరు నీకెవ్వరును ప్రకటించడంతో.. బిగ్ పైట్ కు తెరలేపినట్టయింది. 

 

రిలీజ్ డేట్ తో మొదలైన ఈ పోటీ తీవ్రతను నిర్మాతలు రోజు రోజకు పెంచేస్తున్నారు. సోమవారం రోజు సరిలేరు నీకెవ్వరు నుంచి ఫస్ట్ సాంగ్ వస్తే.. దీనికి పోటీగా.. సామజవరగమన 100మిలియన్ సెలబ్రేషన్స్ అంటూ వీడియో రిలీజ్ చేశారు. 

 

మహేశ్, బన్నీ ఫ్యాన్స్ మధ్య పోటీ లేకపోయినా.. ఒకేరోజు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేయడం.. ఒకే రోజు పాటలు రిలీజ్ చేసి ఈ పైట్ కు నిర్మాతలే ఆజ్యం పోస్తున్నారనిపిస్తోంది. వాళ్లు ఇచ్చారు కదా అని వీళ్లు.. ఏదో ఒకటి రిలీజ్ చేస్తే వాళ్లు ఏదో ఒకటి విడుదల చేసి పోటీ తీవ్రతను పెంచేస్తున్నారు. ఇలాంటి వ్యవహారం అభిమానులు మధ్య చిచ్చు పెట్టే అవకాశముందని.. ఎవరికి వాళ్లు ప్రమోషన్ చేసుకుంటే మంచిదంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మొత్తానికి మహేశ్, బన్నీల ఫ్యాన్స్ లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమ అభిమాన హీరోల సినిమాలు ఒకే రోజు విడుదల కావడంతో వాళ్లలో ఒకింత ఆనందం వ్యక్తమవుతున్నాయి. చూడాలి రెండు సినిమాల్లో ఏది పైచేయి సాధిస్తుందో.. !

మరింత సమాచారం తెలుసుకోండి: