హీరో కార్తికేయ మరో సినిమాతో అలరించబోతున్నాడు. ఆయన నటించిన 90 ఎంఎల్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. డిసెంబర్ ఆరున విడుదల కాబోతోంది. ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. కార్తికేయకి `RX100` వంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన కార్తికేయ క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాకంపైనే ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.

 

 

అందుకే ఇది ఆర్ ఎక్స్ 100 ను మించిపోతుందని కొత్త దర్శకుడు శేఖ‌ర్ రెడ్డి యర్ర చెబుతున్నాడు. నేహా సోలంకిని హీరోయిన్ గా తెలుగు పరిశ్రమకి పరిచయం చేస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం. ఈ సినిమాలో హీరో కార్తికేయ ఎంబీఏ గోల్డ్ మెడ‌లిస్ట్. అయినా సరే పచ్చి తాగుబోతుగా మారతాడు.. అంతే కాదు.. దానికి 'ఆథ‌రైజ్డ్ డ్రింక‌ర్‌' అని బిరుదు కూడా ఉందండోయ్.

 

మరి ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ అలా ఎందుకు మారాడు అన్నదే కథ. ఆర్‌ఎక్స్ 100 తర్వాత కార్తికేయకు మంచి హిట్ పడలేదు. అందుకే ఈ సినిమాలో యూత్ కి కావాల్సిన అన్ని కమర్షియల్ అంశాలు జోడించినట్టు తెలుస్తోంది.

 

సినిమా గురించి నిర్మాత ashok REDDY' target='_blank' title='అశోక్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>అశోక్ రెడ్డి గుమ్మకొండ మాట్లాడుతూ... "90ml ని మొదట డిసెంబరు 5 న విడుదల చేద్దాం అనుకున్నాము .. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల డిసెంబర్ 6 కి మార్చుకున్నాం. పూర్తిగా కొత్త కథ కథనాలతో అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే కమెర్షియల్, ఎంటర్టైనింగ్ మరియు ఎమోషనల్ అంశాలతో రాబోతుంది. మా బ్యానర్ కి పేరు తెచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం `RX100` ని మించిన హిట్ అవుతుందని మా ప్రగాఢ నమ్మకం అన్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: