సినిమా ఇండస్ట్రీలో రకరకాల వ్యక్తులు ఉంటుంటారు. చాలా మంది హీరోలు తమ సినిమా లైఫ్ లోకి తమ కుటుంబ సభ్యులను రానివ్వరు. అయితే టాలీవుడ్ లో కొందరు హీరోల ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్ మెంట్ కూడా ఉంటుంది. ఈ క్రమంలో నే ఓ స్టార్ హీరో భార్య ఇప్పుడు ఆయన సినిమా లైఫ్ లో అన్ని తానే వ్యవహరిస్తో న్న తీరు ఇండస్ట్రీ లో పెద్ద చర్చ నీయాంశంగా మారింది.
ఆ స్టార్ హీరో ఓ బడా ఫ్యామిలీ నుంచి వచ్చాడు.. ఆయన తండ్రి కూడా సూపర్ హీరోనే. అయితే ఆయన భార్యా మణికి సినిమా రంగంలో టచ్ ఉండడంతో తన భర్త కు సినిమాల్లో సాయం చేసేందుకు వచ్చింది. అప్పటి నుంచి ఆ హీరోకు మంచి హిట్లు వచ్చిన మాట నిజమే. అయితే ఆమె తీరుతో ఇప్పుడు ఆ సూపర్ స్టార్ హీరో గురించే అందరూ చర్చించు కుంటున్నారు.
ఆ హీరో గారి భార్య తన భర్త కోసం ఇటీవల ముంబై నుంచి ఓ ఫిట్ నెస్ ట్రైనర్‌ను పిలిపించు కుందట. ఆమె తన పిసినారితనంతో ఆ ఫిట్నెస్ ట్రైనర్‌కు చుక్కలు చూపెడుతోందంట. ఇంట్లో నుంచి టిఫిన్.. ఇంట్లో నుంచే భోజనం పంపిస్తోందట. చివరకు బట్టలు కూడా ఇంట్లోనే ఉతికి పంపిస్తోందట. ఆ ట్రైనర్ హోటల్లో ఏదైనా ఆర్డర్ చేస్తే ఇది ఎందుకు ఆర్డర్ చేసారు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపించడం మొదలుపెట్టిందట.
ఇటీవల ఆయన ఫ్యామిలీ ముంబై నుంచి వస్తే తన ఖర్చులతోనే ఓ రూమ్ తీసుకుని అందులో దింపినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ లో స్టార్ హీరోలతో సైతం పనిచేసిన ఆ ట్రైనర్ ఇప్పుడు ఆ హీరో భార్య దెబ్బకు తట్టుకో లేకపోతున్నాడట. ఇక హీరో ఫారిన్ షూటింగ్‌లు ఉంటే ఆమె భర్తతో కలిసి అక్కడకు చెక్కేసి ఆ ఖర్చు లన్నీ కూడా నిర్మాత అక్కౌంట్లో వేసేస్తుంటుందన్నది అందరికి తెలిసిందే. ఇంతకు ఆ సూపర్ హీరో భార్య ఎవరో ఈ పాటికే మీకు అర్థమైందనుకుంట.