బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. సాహోతో అది కాస్తా స్థిరపడింది. సాహో కమర్షియల్ గా సూపర్ హిట్ కాకపోయినా.. ప్రభాస్ ఇమేజ్ ను మాత్రం కాపాడింది. ప్రత్యేకించి ఆయనకు బాలీవుడ్ లో హిట్ ఇచ్చింది. అలాంటి ప్రభాస్ పక్కన హీరోయిన్ ఛాన్స్ అంటే ఇప్పుడు మాటలు కాదు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో అంతగా సక్సస్ లేని ఓ హీరోయిన్ ఆయన పక్కన ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది.

 

ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా.. ఆమే కాజల్.. టాలీవుడ్‌లో ప్రభాస్, కాజల్‌ జోడీకి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ఫస్ట్ మూవీ ‘డార్లింగ్‌’. ఆ తర్వాత ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’లో కలిసి నటించారు. ఈ చిత్రం విడుదలై దాదాపు 9 ఏళ్లు అవుతోంది.మిస్టర్ పర్ ఫెక్ట్ లో ఈ జంటకు జనం జేజేలు పలికారు. ఆ తర్వాత ప్రభాస్ బాహుబలితో నేషనల్ హీరో అయ్యాడు.

 

కానీ పాపం.. కాజల్ కు ఇప్పుడు సరిగ్గా సినిమాల్లేవ్.. మంచి హిట్లూ లేవు.. ఈ సమయంలో మళ్లీ 9 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రభాస్ పక్కన కాజల్ కు ఛాన్స్ వచ్చిందని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ప్రభాస్‌- కాజల్‌ మరో క్రేజీ ప్రాజెక్టులో కలిసి నటిస్తున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘జిల్‌’ ఫేం రాధాకృష్ణన్‌ ప్రభాస్‌తో ఓ ప్రేమకథను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘జాన్‌’ అనే పేరుతో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో కథానాయికగా పూజా హెగ్డే ఎంపికైంది. ఇప్పుడు పూజాతోపాటు కాజల్‌ కూడా ఈ చిత్రంలో నటించబోతుందనివార్తలు వస్తున్నాయి.

 

అయితే కాజల్ ది ఫుల్ రోల్ కాదట.. జస్ట్ గెస్ట్ అప్పియరెన్స్ అంటున్నారు. పునర్జన్మల నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రంలోని ఓ కీలక సన్నివేశాల్లో ప్రభాస్‌ సరసన కాజల్‌ కనిపిస్తుదని టాక్.. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: