కులం ప్రపంచంలో ఎక్కడా వినిపించని ఈ మాట కేవలం భారతదేశంలో మాత్రమే ఈ నాటికి కూడా చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. తమకు సంబంధించి కులం వారిని ప్రోత్సహించడం వారిని పైకి తీసుకు రావడం వంటివి చేస్తూ ఉంటారు. కానీ మిగతా వారిని పట్టించుకోకపోవడం ఇప్పటికి చాలా ఊరిలో మనం చూస్తూ ఉంటాము. కులం అనే అడ్డుగోడ ఉండకూడదు అనేసి రాజ్యాంగంలో అనగారిన వర్గాలకు భారతదేశంలో రిజర్వేషన్ కల్పించి వారికి కూడా సమాన స్థాయికి ఎదిగే అవకాశం ఇచ్చారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్.

 

కాని ఇప్పుడు టాలీవుడ్లో కూడా కులం అనే ప్రస్తావన ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది .అదేంటి నటన అనేది ఎవరికి సాధ్యం అయితే వాళ్ళు చేస్తారు. కానీ కులం పేరుతో వారికే అవకాశాలు వస్తాయా అని మీకు అనిపించవచ్చు. కానీ ఇది వాస్తవం టాలీవుడ్లో కేవలం తమ కులం వారికి మాత్రమే అవకాశాలు ఇచ్చుకోవడం వంటివి చేసేవారు కానీ ఇంతవరకు ఇవి గుట్టుచప్పుడు కాకుండా జరిగేది.

 

కానీ ఇవి కూడా ఇప్పుడు బహిర్గతం అవుతూ వస్తున్నాయి. ఈ మధ్య ఈ కులం వ్యవస్థ ఇప్పుడు గ్రూపులో కట్టే స్థాయికి ఎదిగాయి అని చెబుతున్నారు. కేవలం తమ కులానికి సంబంధించిన వాళ్లను మాత్రమే పైకి తీసుకొని వస్తూన్నారు. కొందరైతే టాలీవుడ్ ఇండస్ట్రీలో కేవలం తమ కులానికి ఆధిపత్యం ఉండాలని దిశగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారట.

 

కేవలం హీరోలు, నిర్మాతలు, దర్శకులు వరకు మాత్రమే కాకుండా సినీ రంగంలోని అన్ని శాఖలు కూడా ఈ కులం అనే జబ్బు పట్టిపీడిస్తున్న అని సినీ వర్గాలు చెబుతున్నాయి. కానీ వీరు అందరూ కూడా నటిస్తుంటారు. సాధారణ ప్రేక్షకులకు ఇవి అర్థం కాకపోవచ్చు ,కానీ ఇండస్ట్రీలో సంబంధాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇది మామూలు విషయంగా పరిగణిస్తారు. దీనితో సినీ ప్రముఖులు కొందరు ఇండస్ట్రీ ఎటువైపు వెళుతుందో అని ఆందోళన వ్యక్తం చేస్తూన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: