ఓ ఇమేజ్ వచ్చేంత వరకే కష్టపడాలి. ఆ తర్వాత కెరీర్ దానంతట అదే దూసుకెళ్తుందని చెబుతారు. కానీ రాధిక ఆప్టే మాత్రం ఇమేజే పెద్ద కష్టం అంటోంది. ఈ కష్టాలను అధిగమించడం అంత ఈజీ కాదని బాధపడుతోంది. మరి రాధిక ఇమేజ్ గొడవేంటో ఓ సారి పరిశీలిస్తే.. !


రాధిక ఆప్టేకి బాలీవుడ్ లో సూపర్ ఇమేజ్ ఉంది. బోల్డ్ గ్లామర్ తో సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేస్తుందని దర్శక నిర్మాతల నమ్మకం. ఈ నమ్మకమే రాధికని బోల్డ్ క్యారెక్టర్స్ లోకి తీసుకెళ్లింది. అడల్ట్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. అయితే రాధిక మాత్రం ఈ ఇమేజ్ ని అస్సలు ఎంజాయ్ చేయలేకపోతోంది. ఈ సెక్సీ ఇమేజ్ ఓ శాపంలా వెంటాడుతోందని బాధపడుతోంది. 


రాధిక ఆప్టే రీసెంట్ గా ఓ ఉమెన్ షోకు హాజరైంది. అక్కడ రాధికకు కెరీర్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నలకు సమాధానమిస్తూ, ప్రొఫెషనల్ లైఫ్ లో పెద్దగా కిక్ లేదని చెప్పింది రాధిక. తనకున్న ఇమేజ్.. ఫాలోయింగ్ తో చాలా బాధపడ్డానని చెప్పింది రాధిక. 


రాధిక "ఆప్టే బద్ లాపూర్"  లో కొంచెం బోల్డ్ క్యారెక్టర్ ప్లే చేసింది. తర్వాత "అహల్య" అనే షార్ట్ ఫిల్మ్ లోనూ బోల్డ్ గా నటించింది. ఈ సినిమాతో రాధికకు సెక్సీ హీరోయిన్ అనే ఇమేజ్ వచ్చిందట. వరుసపెట్టి బోల్డన్ని అడల్ట్ కామెడీ మూవీస్ నుంచి అవకాశాలొచ్చాయట. ఈ ఇమేజ్ ని తనని చాలా ఇబ్బంది పెట్టిందని చెప్పింది రాధిక. ఈ బాధలోనే బ్యానర్, డైరెక్టర్ తో  సంబంధం లేకుండా చాలా సినిమాలు వదిలేశానని స్టేట్ మెంట్ ఇచ్చింది. అప్పటి నుంచి కొంచెం డిఫరెంట్ గా వెళ్తున్నానని చెప్పింది రాధిక. సెక్సీ ఇమేజ్ తనకు ఓ శాపంలా మారిందని వాపోతోంది. 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: