దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలసి మొట్టమొదటిసారి నటిస్తున్న సినిమా RRR. బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఒక తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాక యావత్ దేశ వ్యాప్తంగా తో పాటు అంతర్జాతీయంగా అందరికీ ఇంట్రెస్ట్ నెలకొని ఉంది. ముఖ్యంగా ఈ సినిమాని దేశవ్యాప్తంగా విడుదల చేయాలని ఐదు భాషల్లో తెరకెక్కించాలని అనుకున్న రాజమౌళి తాజాగా ఈ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఇండస్ట్రీ నుండి ఇటీవల వార్తలు వచ్చాయి.

 

ఇటువంటి నేపథ్యంలో ఈ సినిమాలో రెండు డిఫరెంట్ రోల్ పాత్రలు చేస్తున్న ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ నీ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ మల్టీ స్టారర్ సినిమాలో చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఇద్దరు హీరోల చేత సూపర్ డాన్స్ చేయించటానికి సాంగ్స్ విషయంలో అదిరిపోయే ప్లానింగ్ తో రాజమౌళి ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సినిమా థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ యాక్షన్ పరంగా మాత్రమే కాకుండా డాన్స్ పరంగా కూడా ఇవ్వాలని రాజమౌళిసినిమా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితో సరికొత్త చర్చలు జరుపుతున్నట్లు మాస్ తరహాలో బాణీలు ఉండాలని ఇప్పటికే రాజమౌళి సూచించినట్లు డ్యాన్స్ విషయంలో ఇద్దరు వొళ్ళు నలిగిపోయేలా పాటల అవుట్ పూట్ రావాలని రాజమౌళి కీరవాణికి తెలిపినట్లు సమాచారం.

 

దీంతో ఈ సినిమాలో మొత్తం 8 సాంగ్స్ ఉండబోతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చాలా శరవేగంగా సాగుతుంది. అనుకున్న టయానికి వచ్చే ఏడాది జులై మాసం చివరి కల్లా సినిమాను విడుదల చేసే విధంగా రాజమౌళి సినిమా షూటింగ్ ముందుండి నడిపిస్తున్నాడు అని ఇండస్ట్రీలో వార్తలు చాలా గట్టిగా వినబడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: