పాత తరం నటీమణుల్లో సావిత్రి, జమున తర్వాత హీరోయిన్లుగా తమన నటనతో ఆకట్టుకున్నవారిలో వాణిశ్రీ, శారద ల తర్వాత నటి జయంతి ఒకరు.  సెంటిమెంట్ పాత్రలకు పెట్టింది పేరుగా ఆమెను అప్పట్లో ఎక్కువగా తీసుకునేవారు.  తర్వాత ఎన్నో సినిమాల్లో తల్లి పాత్రల్లో నటించి మెప్పించారు.  తాజాగా సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ నటి జయంతి గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జయంతి అసలు పేరు కమల కుమారి. శ్రీకాళహస్తిలో పుట్టి పెరిగిన ఈమె తెలుగు సినిమాల్లో నటన ప్రారంభించి కన్నడ సినీరంగంలో రాజ్‌కుమార్‌కు సమానంగా అభిమానులను సంపాదించుకున్నారు.

 

జయంతి  తెలుగు, కన్నడ, తమిళ, మళయాల, హిందీ భాషలలో సుమారు 500 సినిమాల్లో నటించారు.  ఒకసారి తమిళ సినిమాలో సావిత్రిగారితో కలిసి నటించవలసి వచ్చింది. అయితే జయంతి గారికి తమిళం రాకపోవడం వలన, రెండు మూడు టేకులు తీసుకున్నారు. దాంతో 'డైలాగ్ చెప్పడం రాని ఆర్టిస్టులను తీసుకుని మా టైమ్ అంతా ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? అంటూ సావిత్రి విసుక్కున్నారట.  దాంతో నలుగురిలో జరిగిన ఆ అవమానం తట్టుకోలేక జయంతి కన్నీరు పెట్టుకొని సెట్ లోనుంచి వెళ్లిపోయారట.  కొంత కాలానికి ఓ కన్నడ మూవీలో లీడ్ పాత్రలో జయంతి నటిస్తుండగా.. ఆమెతో కలిసి సావిత్రి నటించారట.  

 

సావిత్రి సెట్లోకి అడుగుపెట్టగానే జయంతి ఆమె కాళ్లకి నమస్కరించి.. ఆ రోజున నాకు తమిళం రాదని కొపగించుకున్నారు.  అప్పటి నుంచి నేను తమిళంపై దృష్టిపెట్టి నేర్చుకున్నాను  అంటూ చెప్పారట.  జయంతి వినయానికి సావిత్రమ్మ తాను అన్న మాటలకు చాలా బాధపడ్డారట.  తెలుగులో జగదేకవీరునికథ, డాక్టర్‌ చక్రవర్తి, బొబ్బిలి యుద్ధం, కొండవీటి సింహం, దేవదాసు, కంటే కూతుర్నే కను, జస్టిస్ చౌదరి, బడిపంతులు, వంశానికొక్కడు, స్వాతి కిరణం, కొదమ సింహం, కొండవీటి సింహం, అమ్మ మనసు, భక్త ప్రహ్లాద, రాజా విక్కమార్క, ఘరానా బుల్లోడు, శారద లాంటి పేరు పొందిన సినిమాల్లో వైవిధ్య పాత్రల్లో నటించారు. తెలుగులో ఆమె చివరి చిత్రం ‘786 ఖైదీ ప్రేమకథ’. 

మరింత సమాచారం తెలుసుకోండి: