బాలీవుడ్ బెబో కరీనా కపూర్ వ‌య‌సు ఎంతో తెలుసా... 39ఏళ్లు కానీ అలా అస‌లు క‌నిపించ‌దు. ఫిజిక్‌ని కూడా చాలా జాగ్ర‌త్త‌గా మెయిన్‌టెయిన్ చేస్తూ వ‌స్త‌ది. ఓ బిడ్డ‌కు త‌ల్లి అయినా కూడా ఆ అందాన్ని ఆలానే కాపాడుకుంటూ చాలా జాగ్ర‌త్త‌గా మెయిన‌టెయిన్ చేస్త‌ది. ఇక త‌ను తీసుకునే డైట్ ఏంటో త‌నే ఓ సంద‌ర్భంలో చెప్పింది. త‌న న్యూట్రినిస్ట్ నిజుతా దివాక‌ర్‌ని ఫాలో అయ్యే విష‌యం తెలిపింది.

 

గుడ్ న్యూస్ అనే సినిమాలోని ఓ పార్టీ సాంగ్ లో కరీనా కపూర్ అదరగొట్టింది. పార్టీ వేర్ ధరించి, స్లిమ్ ఫిజిక్ తో మతిపోగొట్టింది బెబో. ఆ ఫిజిక్ కు ఆమె ఫాలో అయిన ఆహార నియమాలే కారణం అంటోంది రుజుతా. ఆ సాంగ్ షూటింగ్ కు వారం రోజుల ముందు నుంచి కరీనా తిన్న ఆహారాన్ని, ఫుడ్ ప్లానింగ్ ను బయటపెట్టింది.

 

అదేంటో ఇప్పుడు చూద్దాం. ఉదయాన్నే కుంకుమ పువ్వు కలిపిన నల్లటి ఎండుద్రాక్షను తింటుంది కరీనా. ఇది బ్రేక్ ఫాస్ట్ కాదు, లేచిన వెంటనే తినేది. ఇక బ్రేక్ ఫాస్ట్ లో అందరిలానే పరాఠా-చట్నీ తింటుంది. లంచ్ కు ముందు కొన్ని సబ్జా గింటలు తిని కొబ్బరినీళ్లు తాగుతుంది. ఇక మధ్యాహ్న భోజనం కింద కేవలం పెరుగన్నం, అప్పడం మాత్రం తినేది. ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి వాల్ నట్స్, చీజ్ తింటుంది. సాయంత్రం అరటిపండుతో చేసిన మిల్క్ షేక్ తాగుతుంది. ఇక రాత్రికి డిన్నర్ లో వెజ్ పులావ్ తో పాటు కంద, పెరుగు తీసుకుంటుంది. పడుకునే ముందు పాలు లేదా బనానా మిల్క్ షేక్ తాగేది.

 

ఇలా న్యూట్రిష‌న్ అందే ఫుడ్ తీసుకుంటూ త‌న ఫిజిక్‌ని జాగ్ర‌త్త‌గా కాపాడుకుంది క‌రీనా.  ఇక ఇటీవ‌లె త‌నకు డ్యాన్స్ రాదంటూ ఓ ఉదంతం వ‌చ్చిన విష‌యం తెలిసిందే.  డ్యాన్స్ రాకుండానే ఆమె ఎన్నో ఐటెం సాంగ్స్‌లో కుర్రకారును ఉర్రూతలూగిస్తారా? కానీ ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్.. కరీనాకు డ్యాన్స్ రాదని తేల్చేశారు. ఇది ఇప్పటి సంగతి కాదులెండి. కరీనా కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న కష్టాలు. కరీనా ప్రస్తుతం ప్రముఖ డ్యాన్స్ రియాల్టీ షో ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’కు జడ్జి‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షోకు ఇటీవల సరోజ్ ఖాన్ వచ్చి సర్‌ప్రైజ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: