టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ 1 బుల్లి స్క్రీన్ ను ఎంతటి ఉరూతలు ఊగించిందో ప్రత్యేకంగా చెప్పక్కనర్లేదు. ఈ షో న‌డుస్తున్నంత కాలం ప్రేక్ష‌కులు ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేశారు. వీకెండ్ వ‌చ్చిందంటే చాలు ఎన్టీఆర్ కోసం ఊగిపోయేవారు. అందుకే ఈ సీజ‌న్ టీఆర్పీల్లో రికార్డులు బ‌ద్ద‌లు కొట్టింది.

 

ఆ త‌ర్వాత రెండు సీజ‌న్ల‌కు నేచురల్ స్టార్ నాని, కింగ్ నాగార్జున హోస్టు లుగా ఉన్నారు. అయితే ఎన్టీఆర్ హోస్ట్‌తో పోలిస్తే వీరిద్ద‌రు తేలిపోయార‌న్న అభిప్రాయ‌మే ఎక్కువ మందిలో ఉంది. ఏదేమైనా ఇటీవ‌ల ముగిసిన మూడో సీజ‌న్లో అయితే దారుణ‌మైన విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. టీఆర్పీలు కూడా పెద్ద‌గా రాలేదు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 4కి హోస్ట్ గా ఎన్టీఆర్ నే మళ్ళీ ఒప్పించాలని డిసైడ్ అయ్యార‌ట‌.

 

ఆ టైంకు ఎలాగూ ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ ఫినిష్ అవుతుంది. ఈ సారి ఎన్టీఆర్ తో చాలా డిఫ‌రెంట్ గా షో ప్లాన్ చేయాల‌ని చూస్తున్నార‌ట‌. ఇటీవ‌ల షోలో ఎక్కువుగా రొటీన్‌గా కాన్సెఫ్ట్ లు, టాస్క్ లు ఉన్నాయ‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇక నాలుగో సీజ‌న్లో అవి రాకుండా చాలా కొత్త‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సీజ‌న్ కోసం ఎన్టీఆర్ హోస్ట్ చేసేందుకు ఒప్పుకుంటే ఆయ‌న‌కు భారీ రెమ్యున‌రేష‌న్‌.. ఇంకా చెప్పాలంటే క‌ళ్లు చెదిరిపోయే రేంజ్‌లో రెమ్యున‌రేష‌న్ ఇస్తున్న‌ట్టు టాక్‌..?

 

ఇక ఇటీవ‌ల ముగిసిన సీజ‌న్ 3లో మొత్తం 17 కంటెస్టెంట్స్ తో హోరా హోరీగా సాగి చివరికి విజేతగా రాహుల్ నిలిచాడు. మొత్తానికి బుల్లితెర‌ పై సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న ఈ రియాలిటీ షో నుండి రాబోయే సీజన్ 4 లో మళ్లీ ఎన్టీఆర్ కనిపిస్తే ఇక మళ్ళీ పీఆర్పీ రేటింగ్స్ బద్దలు అవ్వడం ఖాయం. 

మరింత సమాచారం తెలుసుకోండి: