చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో పరిచయమైన నటి అవికా గోర్… ఆ సీరియ‌ల్‌తో బుల్లితెర ప్రేక్ష‌కుల గుండెల్లో నిలిచిపోయింది. ఆతరువాత తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టి తనదైన శైలిలో సినిమాలు చేస్తూ పోతున్నటువంటి నటి అవికాగోర్, మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పై కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. కాగా తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లు అర్జున్ స్టయిల్ ని, డాన్స్ కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. చాలా స్టైలిష్ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా చెప్పుకుంటారు. అయితే తాజాగా అవికాగోర్ తో ఒక ప్రైవేట్ మీడియా ఛానల్ వారు జరిపిన ఇంటర్వ్యూ లో ఒక విలేఖరుడు మీకు అల్లు అర్జున్ తో డాన్స్ చేసే అవకాశం వస్తే ఏమి చేస్తారు? అని అడిగారట.

 

అయితే ఆ ప్రశ్నకు సమాధానంగా “వామ్మో….. అల్లు అర్జున్ తో డాన్స్ చేసి కాళ్ళు విరగొట్టుకోమంటారా? అని అనేసిందట నవ్వుతూ.. ఆ తరువాత నేను కూడా అల్లు అర్జున్ అభిమానినే అని చెప్పుకొచ్చింది ఈ చిన్నారి పెళ్లికూతురు. అయితే అవికాగోర్ చేసిన ఈ వాఖ్యలు చూసినటువంటి అల్లు అర్జున్ అభిమానులు అందరు కూడా పండగ చేసుకుంటున్నారంట. నిజంగానే బన్నీ తో కలిసి డాన్స్ చేయాలంటే అది సామాన్యమైన విషయం కాదు కదా…

 

ఇక ఇదిలా ఉంటే ఉయ్యాలా జంపాలా, లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్త మామ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి అవికాగోర్ తాజాగా తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఏకకాలంలో నిర్మాణం జరుపుకున్న ఓ చిత్రంలో నటించింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘మంజా’ పేరుతో విడుదల చేస్తున్నారు. గిరిధర్ ప్రొడక్షన్స్ పతాకంపై గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. కిషన్ ఎస్‌ఎస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆస్కార్ రేసులో ఎంపికైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: