వెంకటేశ్ పైకి కనిపించడు గానీ.. టెన్షన్ ఎక్కువే. మేనల్లుడు చైతూతో కలిసి నటించిన మూవీ వెంకీమామ కోసం పడ్డ టెన్షన్ అంతా ఇంతా కాదు. ప్రెస్ మీట్ లో ఏడ్చేసి తనకున్న టెన్షన్ మొత్తం తీర్చేసుకున్నాడు. ఇంతకీ వెంకటేశ్ ఎందుకు టెన్షన్ పడ్డాడు అనే కదా..! 

 

ప్రేమమ్ సినిమాలో వెంకటేశ్ గెస్ట్ రోల్ పోషించినా.. ఫస్ట్ టైమ్ మేనల్లుడు నాగచైతన్యతో కలిసి వెంకీమామ సినిమా చేశారు. ఒకవైపు మేనల్లుడు.. మరోవైపు అన్న సురేష్ బాబు నిర్మిస్తున్న మూవీ ఇది. అయినా టెన్షన్ తప్పలేదు. ఈ టెన్షన్ అంతా సినిమా రిలీజ్ గురించే. ఎట్టకేలకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో.. ఊపిరిపీల్చుకున్నాడు వెంకీ. ఈ ఆనందాన్ని ఆనంద భాష్పాలతో చెప్పాడు వెంకటేశ్. వెంకీమామ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయడంతో టెన్షన్ తీరినా.. మరో టెన్షన్ మాత్రం 30ఏళ్ల నుంచి వెంటాడుతూనే ఉంది. తనకున్న వీక్ నెస్ ను పబ్లిక్ గా ఒప్పేసుకున్నాడు వెంకీ. 

 

వెంకీమామ రిలీజ్ విషయంలో మామే కాదు.. అల్లుడు కూడా టెన్షన్ పడ్డాడు. ప్రెస్ మీట్ లో వాళ్ల బాధను బైటకు చెప్పుకోకుండా ఉండలేకపోయారు. నిర్మాత సురేష్ బాబు వెంకీమామను సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకున్నాడు. బన్నీ, మహేశ్ సినిమాలు ఉండటంతో.. వెనక్కి తగ్గి డిసెంబర్ లోనే రిలీజ్ కు సన్నాహాలు చేశారు. 13..20..25 రిలీజ్ కు మూడు ఆప్షన్స్ ఉన్నా.. కాంపిటీషన్ లేకుండా.. సోలోగా 13న రిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు. విడుదలకు తక్కువ టైమ్ ఉండటంతో.. ప్రెస్ మీట్ పెట్టి మరీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మొత్తానికి వెంకీమామ మూవీపై అటు వెంకటేశ్ అభిమానులకు.. ఇటు అక్కినేని ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తమ అభిమాన హీరోలను ఒకేసారి తెరమీద చూసేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.  రిలీజ్ ఎపుడు అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: