ప్రభాస్ అభిమానులకు అతడు ఒక డార్లింగ్ అతడి వయసు 40 సంవత్సరాలు అయినప్పటికీ అమ్మాయిలకు ఇప్పటికీ అతడు కలల రాజకుమారుడు. ప్రభాస్ కనిపిస్తే చాలు అమ్మాయిలు మాత్రమేకాదు అబ్బాయిలు కూడ పులకరించిపోతారు. 

అలాంటి ప్రభాస్ కు ఇప్పుడు టాప్ సెక్సీయస్ట్ ఏషియన్ మెన్ లిస్టులో స్థానం పొందటం సంచలనంగా మారింది. బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ నుండి హృతిక్ రోషన్ కు ఈ లిస్టులో స్థానం దక్కితే దక్షిణాది హీరోలలో ప్రభాస్ కు మాత్రమే ఈ స్థానం దక్కింది. ప్రభాస్ కన్నా చాలామంది అందంగా ఉండే హీరోలు మన సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నా లండన్ కు చెందిన బ్రిటీష్ న్యూస్ వీక్లీ ఆన్ లైన్ లో నిర్వహించిన ఈ ఓటింగ్ లో ప్రభాస్ కు అత్యధిక స్థాయిలో ఓట్లు రావడంతో ప్రభాస్ మరొకసారి తాను నేషనల్ స్టార్ ని అని నిరూపించుకున్నాడు. 

లండన్ నుండి ప్రచురింపబడే బ్రిటీష్ న్యూస్ వీక్లీ ఈస్ట్రన్ ఐ ఏషియన్ దేశాలకు సంబంధించి సెలెబ్రెటీలలో మోస్ట్ సెక్సీయస్ట్ మెన్ లిస్టును ప్రతి సంవత్సరం ప్రకటిస్తుంది. ఇప్పుడు ఆలిస్టులో ప్రభాస్ కు స్థానం దక్కడంతో అతడి అభిమానులు మంచి జోష్ లో ఉన్నారు. ప్రభాస్ ‘సాహో’ అనుకున్న స్థాయిలో విజయవంతం కాకపోయినా అతడికి ఈ లిస్టులో స్థానం పొందటం బట్టి ప్రభాస్ లుక్స్ లో ఉన్న మ్యానియా అందరికీ అర్ధం అవుతుంది. 

ఇది ఇలా ఉండగా ప్రభాస్ తన లేటెస్ట్ మూవీ ‘జాను’ షూటింగ్ ను పక్కకు పెట్టి తన స్నేహితులతో మళ్ళీ విదేశాలకు వెళ్ళిపోయాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో ప్రభాస్ కు వచ్చిన ఈకొత్త గుర్తింపుకు సంబంధించి అతడి అభిమానులు చేసే హడావిడికి ప్రభాస్ చాల దూరంలో ఉన్నాడు. ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్క్రిప్ట్ విషయంలో మళ్ళీ తేడాలు రావడంతో ప్రభాస్ ఇప్పుడు ఇలా మళ్ళీ హాలిడే ట్రిప్ కు వెళ్ళినట్లు టాక్..

 

మరింత సమాచారం తెలుసుకోండి: