దబంగ్ సినిమాతో హిందీ సినిమా ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ సోనాక్షి సిన్హా. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. ఆ తర్వాత కూడా కొన్ని రోజులు ఈమె ఉంటే సినిమా హిట్ అనే సెంటిమెంట్ పాకిపోయింది. కానీ ఆ తర్వాతే అసలు సినిమా మొదలైంది. 'నాకు 55 యేళ్ల వయసు వచ్చాకా.. సినిమాల్లో ఇరవై రెండేళ్ల కుర్రాళ్లతో రొమాన్స్ చేయను...' అని అంటోంది సోనాక్షి సిన్హా! ఈ మాట ఎవరికి తగలాలో వారికి గ‌ట్టిగానే త‌గిలింది. బాలీవుడ్ లో అయినా.. టాలీవుడ్ లో అయినా..యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో యాభై, అరవై సంవత్సరాల వయసు హీరోలు కూడా  కుర్ర భామలతో తెర మీద తెగ రొమాన్స్ చేసేస్తూ ఉంటారు.

 

సౌత్ లో అయినా నార్త్ లో అయినా అదే పరిస్థితి. చాలా మంది హీరోల వయసు యాభై దాటింది! అరవై దాటాకా కూడా ఇంకా కొంతమంది హీరోలు తెర మీద హీరోయిన్ల‌కు వలపు బాణాలు వేసురుతూ ఉన్నారు. ఆ సీన్లే ఎబ్బెట్టుగా ఉంటున్నాయి. అయినా వారు మొహమాట పడటం లేదు. షష్టిపూర్తి చేసుకుని ఐదారేళ్ల తర్వాత కూడా ఇంకా తొలి ప్రేమ సన్నివేశాల్లో నటిస్తూ నవ్వుల పాలవుతున్నారు కొంద‌రు నటులు.

 

ఇలాంటి క్రమంలో సోనాక్షి సిన్హా ఆ హాట్ కామెంట్ చేసింది. తనకే గనుక యాభై ఐదేళ్లు వచ్చాకా సినిమాల్లో నటించే అవకాశం ఉంటే, అప్పుడు ఇరవై రెండేళ్ల కుర్రాళ్లతో తెరపై రొమాంటిక్ సీన్లలో నటించనని వ్యంగ్యంగా చెప్పింది సోనాక్షి. యాభై ఐదేళ్ల హీరోలు, ఇరవై రెండేళ్ల అమ్మాయిలకు జతగా నటిస్తుండటాన్ని సోనాక్షి ఇలా ప్రస్తావించింది. తమ కూతురు వయసున్న అమ్మాయిలతో రొమాన్స్ చేసే హీరోలపై సోనాక్షి ఇలా పంచ్ విసిరింది! ఎంతైనా షాట్ గన్ కూతురు కదా! రీసెంట్ గా సల్మాన్ ఖాన్ నటించిన 'దబాంగ్ 3' సినిమాలో కూడా 53 ఏళ్ల సల్మాన్ 21 ఏళ్ల సాయి మంజ్రేకర్ తో క‌లిసి న‌టించారు. ముందుగా ఓ విలేకరి.. ''మాధురి దీక్షిత్.. కుర్ర హీరో ఇషాన్ ఖట్టర్ తో రొమాన్స్ చేస్తే ఎవరైనా చూస్తారా అని ప్ర‌శ్నించ‌గా అదైతే తెలియ‌దు కానీ ఆ కాంబినేష‌న్ మాత్రం విన‌డానికి విచిత్రంగా ఉంది అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: