మాలీవుడ్ లో 90వ దశకంలో స్టార్‌ కథానాయకులకు దీటుగా బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన తార షకీలా.  ఆమె నటించిన శృంగార ప్రధాన చిత్రాలతో దక్షిణాదిలోని అన్ని సినిమాల్లో విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకుంది. ముఖ్యంగా మలయాళ చిత్రసీమపై షకీలా చెరగని ముద్ర వేశారు. సినీ రంగంలో హీరోయిన్ గా గుర్తింపు పొందాలని వచ్చి శృంగార తారగా మారారు షకీలా. లీవుడ్ లోనే కాకుండా తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలో కూడా షకీలా పలు సినిమాల్లో నటించారు.  షకీలా ఫాంలో ఉండగా ఆమె సినిమాలతో పోటి పడేందుకు మమ్ముట్టి, మోహన్‌లాల్‌ లాంటి టాప్‌ స్టార్లు కూడా భయపడేవారని అప్పట్లో టాక్.  

 

శృంగార తారగా నటించిన ఆమె సినిమాలు ఒక ఊపు ఊపాయి. అప్పట్లో తమిళ తెలుగు శృంగార సినిమాలు చేసిన ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు వాటికి చాలా దూరంగా ఉంటుంది.  ఇటీవల కాలంలో సినిమాలకు సెన్సార్‌ ఇబ్బందులు ఎదురవుతున్న వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా శృంగార తార షకీలా నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమాకు కూడా ఈ సమస్య ఎదురైంది.  అయితే షకీలా ఇటీవల నిర్మాతగా మారి ఓ సినిమాను తెరకెక్కించారు. `లేడీస్‌ నాట్‌ అలవ్డ్‌` పేరుతో షకీల నిర్మించిన సినిమాకు సెన్సార్‌ సర్టిఫికేట్ ఇచ్చేందుకు సెన్సార్‌ బోర్డ్‌ నిరాకరించింది.

 

ఇప్పటికే ఈ సినిమాను రెండు సార్లు రిజెక్ట్ చేసింది సెన్సార్ బోర్డ్‌. దీంతో షకీలా సెన్సార్‌ కమిటీ సభ్యులపై ఫైర్‌ అవుతోంది.  ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో అడల్ట్‌ కంటెంట్‌తో తెరకెక్కిన ఎన్నో సినిమాలకు సెన్సార్‌ సర్టిఫికేట్ ఇచ్చిన కమిటీ నా సినిమా విషయంలో మాత్రం ఎందుకు ఇలా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

 

 సినిమాలో నా పేరు ఉండటం మీకు నచ్చేలేదా..? ఎంతో కష్టపడి అప్పులు తీసుకువచ్చి సినిమాను పూర్తి చేశాం. ఇక సెన్సార్‌ వాళ్లు చిన్న సినిమా నిర్మాతలను మాత్రమే డబ్బులు అడుగుతున్నారని, భారీ సినిమా నిర్మాతలను అడిగే ధైర్యం వాళ్లకు లేదని ఆరోపించారు. అంతేకాదు తన దగ్గర అన్ని రికార్డ్స్‌ ఉన్నాయని, అవసరమైతే వాటిని బయటపెడతానంటూ వార్నింగ్‌ ఇచ్చారు షకీలా. మరి ఈ విషయం ఎంత వరకు వెళ్తుంతో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: