నిన్నటి వరకు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ దేవదాస్.. గ్యాంగ్ లీడర్.. కృష్ణార్జున యుద్ధం లాంటి పాత టైటిల్స్ తో వచ్చినా నాని.. రూట్ మార్చాడు. కొత్త టైటిల్సే కాదు.. డిఫరెంట్ టైటిల్స్ ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం వి సినిమాలో నటిస్తున్నాడు. త్వరలో టక్ జగదీష్ అన్నటైటిల్ తో వస్తున్నాడు. టక్ జగదీష్ అంటే ఏమీటో అర్థం కావాలంటే ఫస్ట్ లుక్ చూడాల్సిందే. 

 

నిన్ను కోరి తర్వాత దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంతో నాని నటించే సినిమా త్వరలో మొదలుకానుంది. సినిమా సెట్స్ పైకి రాకముందే.. టక్ జగదీష్ అన్న టైటిల్ అనౌన్స్ చేశారు. టైటిల్ జస్టిఫికేషన్ కోసం నాని టక్ చేసుకున్న ఫోటోను సింబాలిక్ చూపిస్తూ.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. టగ్ జగదీష్ మూవీతో శివ నిర్వాణ రూటు మార్చాడనిపిస్తోంది. దర్శకుడిగా పరిచయమైన నిన్నుకోరితో.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ తీసి ఆకట్టుకుంటున్నాడు. నాగచైతన్యతో తీసిన మజిలీతో ఫ్యామిలీ డైరెక్టర్ ముద్ర పడింది. 

 

నిన్నుకోరి.. మజిలీతో ఫ్యామిలీ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిన శివ నిర్వాణ ఈ ఇమేజ్ నుంచి బైటపడాలనుకుంటున్నాడా?  అనిపిస్తోంది. ఇప్పటి వరకు సాఫ్ట్ టైటిల్స్ తో వచ్చిన శివ ఈ సారి టక్ జగదీష్ అంటూ డిఫరెంట్ టైటిల్ ఎంచుకున్నాడు. టైటిల్ వరకే ఇలా ఉన్నా.. ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే అంశాలన్నీ ఇందులో ఉంటాయేమో..! జనవరి ప్రధమార్థంలో షూటింగ్ మొదలయ్యే ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్స్ ఐశ్వర్య రాజేశ్.. రీతు వర్మ నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 

 

సహజ నటుడిగా ప్రేక్షకుల మెప్పు పొందుతున్న నాని ఓ కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నాడు. ఈ సారి కొత్త కథలో పరకాయ ప్రవేశం చేసి తన టాలెంట్ ఏంటో చూపించబోతున్నాడు. టక్ జగదీష్ లో నాని ఎలా కనిపించబోతున్నాడో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: