వెంకటేష్, నాగచైతన్య మొట్టమొదటిసారి నటించిన వెంకీ మామ సినిమా డిసెంబర్ 13వ తారీకు న విడుదల కానుంది. దీంతో ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు అదరగొట్టే రీతిలో ఇటీవల జరగడంతో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అన్న టెన్షన్ నా కూడా ఉందని ప్రీ రిలీజ్ వేడుకల సమయం లో అదరగొట్టే స్పీచ్ లో వెంకటేష్ మాట్లాడటంతో సినిమా రాబోయే వారం విడుదల అవుతున్న నేపథ్యంలో సినిమాలో వెంకటేష్ మరియు నాగచైతన్య తర్వాత అందరి దృష్టి ఎక్కువగా హీరోయిన్ రాశి ఖన్నా పై ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి.

 

విషయంలోకి వెళితే ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మకి అవకాశాలు తగ్గాయి. ఇండస్ట్రీ కి మొట్టమొదటి సారి వచ్చిన సమయంలో వరుస విజయాలు అందుకుని అదిరిపోయే అవకాశాలు దక్కించుకుంది. అయితే తాజాగా మాత్రం అవకాశాలు రాశి ఖన్నా కి తగ్గిన నేపథ్యంలో రాశి ఖన్నా నటించిన 'వెంకీ మామ' సినిమా హిట్ అవుతుందో లేదో అన్న టెన్షన్ ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఈ సినిమాలో నాగ చైతన్య కి జోడిగా నటించడం జరిగింది. నాగచైతన్యకి లవర్ గా ఈ సినిమాలో రాశిఖన్నా నటించడంతో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సన్నివేశాలు అదరగొట్టే రీతిలో ఉన్నట్లు సినిమా యూనిట్ నుండి అందుతున్న సమాచారం.

 

మొత్తంమీద చూసుకుంటే రాశిఖన్నా కి… 'వెంకీ మామ' సినిమా అనేది కీలకం అని ఇండస్ట్రీలో అందరూ మాట్లాడుకుంటున్నారు. ఒక పక్క పూజా హెగ్డే వరుస విజయాలతో దూసుకుపోతున్న నేపథ్యంలో...పూజా హెగ్డే కంటే ముందే స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించిన రాశిఖన్నా కి అవకాశాలు తగ్గడంతో ఈ సినిమాతో అదిరిపోయే హిట్ పడితే మాత్రం రాశిఖన్నా కి మళ్లీ అవకాశాలు రావడం గ్యారంటీ అన్నట్టుగా ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ 'వెంకీ మామ' సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో చాలా చురుగ్గా పాల్గొంటోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: