జబర్దస్త్ కామెడీ షో నుండి ఇటీవల బయటకు వచ్చేసిన నాగబాబు తన యూట్యూబ్ ఛానల్ లో అనేక సంచలన కామెంట్ జబర్దస్త్ షో పై చేస్తున్నారు. తాజాగా ఆయన చేస్తున్న కామెంట్లు బట్టి చూస్తుంటే షో యాజమాన్యంతో తలెత్తిన వివాదాల వల్లే జబర్దస్త్ షో నుండి బయటకు వచ్చేసినట్లు అర్థమవుతుంది. తాజాగా జబర్దస్త్ షో యాజమాన్యంపై నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు ఈ విధంగా చేశారు. జబర్దస్త్ షో నిర్వాహకులు కార్పోరేట్ సంస్థల జబర్దస్త్ లో పనిచేసే నటీనటుల పై వ్యవహరించారని షో అంతా పాపుల రావడానికి గల కారకులైన నటీనటుల బాగోగులను సరిగ్గా పట్టించుకునే వారు కాదని కేవలం వారిని వాడుకున్నట్లు గా మాత్రమే చూసేవారని అటువంటి పరిస్థితుల్లో తాను చాలా జబర్దస్త్ యాజమాన్యం నుండి గమనించడం జరిగిందని నాగబాబు చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా జబర్దస్త్ షోలో పాల్గొనే నటీనటులతో ఎంతో సన్నిహితంగా ఉండే వాడిని ఒక్కోసారి వారి అవసరాలను తీర్చిన సందర్భాలు అదేవిధంగా చాలా సంఘటనలలో వారికి అండగా నిలబడిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటూ నాగబాబు తెలిపారు.

 

ఇదే క్రమంలో రోజా గురించి మాట్లాడుతూ...'నాతో పాటు జడ్జిగా వ్యవహరించిన రోజా కూడా జబర్దస్త్ నటులతో సన్నిహితంగానే ఉండేవారు. కానీ నా అంత క్లోజ్ గా రోజా వారితో లేరు. రోజాకు రాజకీయ పరమైన పనులు కూడా ఉండడంతో షో అయిపోగానే వెళ్ళిపోయేవారు. పలు సందర్భాల్లో రోజా తనతో ఎమోషనల్ గా కొన్ని సంగతులు చెప్పింది. నగిరిలో తాను ఎమ్మెల్యేగా గెలవడానికి జబర్దస్త్ ఇమేజ్ చాలా బాగా ఉపయోగపడిందని ఆమె కలిపినట్లుగా నాగబాబు తెలుపుతూ జబర్దస్త్ షో కి చాలా ఎమోషనల్ గా సన్నిహితంగా కనెక్ట్ అయినట్లు నాగబాబు చెప్పుకొచ్చారు. కొన్ని కొన్ని స్కిట్ లు వేసిన సందర్భంలో షో నుండి నటీనటులను యాజమాన్యం తీసేసిన సందర్భాలున్నాయి అటువంటి సమయంలో హఠాత్తుగా అలా చేయకూడదు అని తిరిగి వారిని షో లోకి తీసుకోవడం జరిగిందని ఈ విధంగా ఒక కార్పోరేట్ సంస్థల జబర్దస్త్ నటీనటుల విషయంలో షో నిర్వాహకులు వ్యవహరించడం జరిగిందని నాగబాబు సీరియస్ అయ్యాడు.

 

ఇదే క్రమంలో ఏదైనా జబర్దస్త్ షోలో స్కిట్ అతిగా ఇతరులను కించపరిచే విధంగా ఉంటే కచ్చితంగా స్కిట్ ఆపేసిన సందర్భాలు ఉన్నాయని నాగబాబు తెలిపారు. యాంకర్ రేష్మి విషయంలో ఇటువంటి ఘటన జరిగిందని వెంటనే స్కిట్టు చేసినవారికి వార్నింగ్ ఇచ్చినట్లు నాగబాబు పేర్కొన్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: