ఎఫ్ 2 తో వెంకటేష్, మజిలీతో నాగ చైతన్యలు హిట్ కొట్టారు. ఈ రెండు సినిమాల తరువాత ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా వెంకీ మామ.  ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యి రిలీజ్ కు ముస్తాబవుతున్నది.  సినిమా రిలీజ్ కోసం మొదట సంక్రాంతి అనుకున్నారు.  కానీ, అప్పటికే అనేక సినిమా సంక్రాంతి బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకున్నాయి.  క్రిస్మస్ కు వద్దామని అనుకుంటే అప్పుడు కూడా చాలా సినిమాలు ఉన్నాయి.  సోలోగా రావాలని ఫిక్స్ కావడంతో ఎలాగైనా మంచి డేట్ చూసుకొని రావాలని అనుకున్నారు.  


ఇందులో భాగంగానే ఈ ఇద్దరు కలిసి డిసెంబర్ 13 న సందడి చేసేందుకు సిద్ధం అవుతున్నారు.  డిసెంబర్ 13 వ తేదీన సినిమా భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్నది.  డిసెంబర్ లో వస్తున్న సినిమాపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి.  మొదటిసారి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పైగా నాగచైతన్య ఇప్పటి వరకు చేయని పాత్రలో సినిమా చేస్తున్నారు.  పాయల్ రాజ్ పుత్, రాశి ఖన్న హీరోయిన్లుగా చేస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్న సంగతి తెలిసిందే.  


ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెండు సాంగ్స్ రిలీజ్ చేశారు.  రెండు కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.  టీజర్ సైతం సూపర్ గా మెప్పించింది. కామెడీతో పాటుగా సినిమా ఫ్యామిలీ ఓరియెంటెడ్ గా రాబోతున్నది.  పాయల్ రాజ్ పుత్ ఇందులో టీచరమ్మగా కనిపించబోతున్నది.  ఆర్మీ ఆఫీసర్ నాగచైతన్య బోర్డర్ నుంచి వచ్చిన తరువాత ఎం జరిగింది అన్నది సినిమా కథ.  


పల్లెటూరిలో ఎలాంటి వెంకటేష్ ఎలాంటి హంగామా చేశాడు.  రైసు మిల్లు ఓనర్ పాత్రలో ఎలా మెప్పించాడు అన్నది  తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.  సినిమా ఎలా ఉంటుంది అన్నది.  సినిమా డేట్ కోసం చాలా కష్టపడ్డారు.  సింగిల్ గా వస్తేనే  సినిమాకు పెట్టిన డబ్బులు వెనక్కి వస్తాయి. సురేష్ ప్రొడక్షన్ లో వస్తున్న సినిమా కావడంతో సినిమా బాగుంటుందని అంటున్నారు.  మరి చూద్దాం ఎలా ఉంటుందో.  

మరింత సమాచారం తెలుసుకోండి: