రియల్ లైఫ్‌ లో మామా అల్లుళ్లు అయిన విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య రీల్ లైఫ్‌ లోనూ మామా అల్లుళ్లుగా నటించారు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న క్రేజీ మల్టీస్టారర్ మూవీ ‘వెంకీమామ’. హీరోయిన్ లు గా రాశీ ఖన్నా, పాయల్ రాజ్‌ పుత్ నటించారు. ఈ సినిమాకి కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహించారు. సురేష్ బాబు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఈ సినిమా విడుదలపై రకరకాల రూమర్లు ఇప్పటికే సర్క్యులేట్ అయిన విషయం తెలిసిందే. 

 

‘వెంకీమామ’ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్టు మొదట్లో వార్తలు వచ్చాయి. కానీ, అదే టైం లో మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాలు వస్తుండటంతో ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందన్నారు. అయితే, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అనూహ్యంగా ‘వెంకీమామ’ సినిమాను సంక్రాంతి కంటే ముందుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. వెంక‌టేష్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 13న‌ సినిమాను విడుద‌ల చేస్తున్నారు. 

 

దగ్గుబాటి, అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆస‌క్తిగా ఈ సినమా కోసం ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణను కాస్త తగ్గిస్తూ విడుదల తేదీని ప్రకటించింది చిత్ర యూనిట్.  ఈ సినిమా విడుద‌ల తేదీని అనౌన్స్ చేస్తూ.. హీరో రానా ద‌గ్గుబాటి, డైరెక్టర్ బాబీ ఓ ఫ‌న్నీ వీడియో కూడా విడుద‌ల చేశారు.

 

మీడియా సమావేశంలో నాగ చైతన్య మాట్లాడుతూ.. తాను ఎన్ని సినిమాలు చేసినా తన లైఫ్‌లో గుర్తుండేవి రెండే చిత్రాలని అవి మనం, వెంకీమామ అని చెప్పుకొచ్చాడు చై. ఇవి రెండూ తన కుటుంబాలతో కలసి చేశానని, ఆ మెమోరీస్ ఎప్పటికీ అలానే తనతో ఉండిపోతాయని తెలిపాడు. ఈ చిత్రం అందరికీ ఎమోషనల్‌ గా కనెక్ట్ అవుతుందని, అందరికీ నచ్చుతుందని అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: