'బాహుబలి' సినిమా తో దేశవ్యాప్తంగా తో పాటు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందాడు ప్రభాస్. దీంతో ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ తో సినిమా చేయడానికి చాలా మంది డైరెక్టర్లు నిర్మాతలు వెంటపడుతున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన 'సాహో' సినిమా ఫ్లాప్ అయినా గాని ప్రభాస్ కి ఉన్న మార్కెట్ బట్టి చూస్తే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏకంగా 300 కోట్లు కొల్లగొట్టింది. ఇదిలా ఉండగా తాజాగా 'ఏషియన్‌ సెక్సియెస్ట్‌ మేల్స్‌ 2019' లిస్ట్ ఇటీవల విడుదల కావడం జరిగింది. ఈ లిస్టులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్థానం దక్కించుకున్నారు. విషయంలోకి వెళితే బ్రిటిష్‌ ఈస్టర్న్‌ సంస్థ ఆన్‌లైన్‌ పోల్‌ ఆధారంగా బుధవారం లండన్‌లో విడుదల చేసిన ఈ జాబితాలో టాప్ 10 లో ప్రభాస్ పేరు ఉంది. ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీకి చెందిన ఏ హీరో ఈ స్థానాన్ని దక్కించుకోలేదు.. ఒక్క ప్రభాస్ కి మాత్రమే సెక్సియెస్ట్‌ మేల్స్‌ 2019' లిస్ట్ లో  తనకంటూ ఓ స్థానం దక్కించుకోవడం జరిగింది.

 

సోషల్ మీడియాలో మరియు ఈస్టర్న్‌ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా జరిగించిన పోల్ సర్వేలో సెక్సీ హీరోగా ఎక్కువ ప్రభావం చూపిన హీరోల గురించి ఓ లిస్ట్ ఇటీవల తయారు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో జరిగిన పోల్ లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ అగ్ర స్థానంలో నిలిచి గత ఐదు సంవత్సరాల నుండి తన స్థానాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు.

 

అయితే తాజాగా మాత్రం బాహుబలి తో మరియు సాహో సినిమాలతో అంతర్జాతీయంగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ తాజాగా జరిగిన 'ఏషియన్‌ సెక్సియెస్ట్‌ మేల్స్‌ 2019' పోల్ లో మొట్టమొదటిసారి పదవ స్థానం లో ప్రభాస్ కి స్థానం దక్కడంతో ఈ విషయం ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: