రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్... షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  ఈ సినిమా షూటింగ్ దాదాపుగా 70శాతం వరకు పూర్తయింది.  మిగతా షూటింగ్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయబోతున్నారు.  టాకీ పార్టీ చాలా వరకు కంప్లీట్ చేయగా ఇప్పటికే ఓ సాంగ్ కూడా పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. స్వాతంత్ర కాలం నాటి కథ కాబట్టి ఇందులో ఆ కాలానికి సంబంధించిన విషయాలు ఎక్కువగా ఉంటాయి.  


అల్లూరి సీతారామరాజు కు సంబంధించిన విషయాలు, కొమరం భీం కు సంబంధించిన విషయాలు ఇందులో ఉన్నాయి.  స్వాతంత్ర కాలానికి చెందిన సినిమా అయినప్పటికీ ఇది ఫిక్షన్ కావడంతో ఇందులో కల్పితమే ఎక్కువగా ఉంటుంది.  ఈ కల్పితం ఎలా ఉంటుంది అన్నది సస్పెన్స్.   ఎన్టీఆర్.. రామ్ చరణ్ హీరోలుగా చేస్తున్న సినిమాలో అలియా భట్ హీరోయిన్.  


ఎన్టీఆర్ కు జోడిగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది.  అలియా... రామ్ చరణ్ మధ్య ఇప్పటికే కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉన్నాయట.  ఓ సాంగ్ కూడా ఉందట.  ఈ సాంగ్ ను ఇప్పటికే సినిమా షూటింగ్ చేసినట్టు తెలుస్తోంది.  వీరిద్దరి మధ్యనే కాకుండా, ఎన్టీఆర్- ఒలీవియా మధ్య కూడా రొమాంటిక్ సీన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది.  ఈ రొమాంటిక్ సీన్స్ ను ఒకటి ఇప్పటికే షూట్ చేశారట.  


యాక్షన్ మాత్రమే కాదు రొమాంటిక్ సీన్స్ కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి.  ఇక ఇదిలా ఉంటె, ఈ మూవీ వచ్చే ఏడాది జులై 30 న రిలీజ్ కాబోతున్నది.  ఇందులో మొత్తం 8 సాంగ్స్ ఉన్నట్టు సమాచారం. ఒలీవియా కంటే అలియా పాత్ర నిడివి తక్కువ ఉండబోతుంది.  అలానే ఇందులో విలన్లుగా హాలీవుడ్ స్టార్స్ నటిస్తున్నారు.  జనవరి 1 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ కాబోతున్నది.  

మరింత సమాచారం తెలుసుకోండి: