వెంకటేష్ .. నాగ చైతన్య హీరోలుగా చేస్తున్న వెంకిమామ సినిమా డిసెంబర్ 13 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  సినిమా విషయంలో ఇప్పటికే అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.  ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈనెల 7 వ తేదీన ఖమ్మంలో జరగబోతున్నది.  తక్కువ సమయంలోనే సినిమాను రిలీజ్ చేయబోతుండటంతో ప్రచారంలో వేగాన్ని పెంచారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ఆడియో, ట్రైలర్ రిలీజ్ చేస్తారు.  


ఇక ఇదిలా ఉంటె ఇందులో వెంకటేష్ కు జోడిగా పాయల్ రాజ్ పుత్ నటిస్తోంది.  చిన్నప్పటి నుంచి నాగచైతన్యను పెంచి పెద్ద చేస్తాడు.  తన గురించి పట్టించుకోకుండా, చైతు కెరీర్ మీద దృష్టి పెట్టి పెళ్లి విషయం మర్చిపోతాడు.  బోర్డర్ లో ఉన్న  చైతు ఇంటికి వచ్చిన తరువాత వెంకటేష్ కు పెళ్లి చేయాలని అనుకుంటాడు.  పిల్ల ఎవరు ఏంటి ఎలా అని వెతికే క్రమంలో పాయల్ కనిపిస్తుంది.  ఆమెకైతే చైతూకు సరిపోతుందని చెప్పి వెంకటేష్ తో ప్రేమలో పడేలా చేస్తారు. 


అలా ఇద్దరి మధ్య ప్రేమ పుడుతుంది.  వారిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది ఏంటి అన్నది సినిమా సినిమాలో చూడాల్సిందే.  వెంకటేష్, పాయల్ మధ్య రొమాంటిక్ సీన్స్ ను చాలా ఉన్నాయట.  ఆ సీన్స్ చాలా ఫన్నీగా డిజైన్ చేసినట్టు సమాచారం.ఈ సినిమాలో ఫన్ తో పాటు కావాల్సినంత ఫ్యామిలీ సీన్స్ కూడా ఉన్నాయట.  సినిమా ప్రతి ఒక్కరిని మెప్పిస్తుందని అంటున్నారు.  


ఈ సినిమాలో నాగ చైతన్యపై తీసిన ఆర్మీ బాక్ డ్రాప్ సీన్స్ అద్భుతంగా ఉంటాయని అంటున్నారు. సినిమాపై అంచనాలు ఉన్నాయి.  పక్కా మాస్ తో పటు క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నది. మరి ఈ సినిమాలో  చైతు, వెంకటేష్ ఎంత హంగామా చేశారో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.  సురేష్ ప్రొడక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు బాబీ దర్శకుడు.  జైలవకుశ తరువాత చాలా కాలం వెయిట్ చేసి సినిమాను తెరక్కించాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: