హీరో వెంకటేష్ అనగానే కళ్లతోనే ప్రేక్షకుల్ని ఏడిపించేస్తాడు. తన నటనతో అభిమానులను నవ్విస్తాడు. ఫ్యామిలీ హీరో గా మహిళల మనసుల్ని ఎప్పుడో దోచేసాడు. ఇకపోతే అభిమానులు విక్టరీ వెంకటేష్ ను, ముద్దుగా వెంకీ అని పిలుస్తారు. ఇక ఇప్పటి వరకు దాదాపు 70కి పైగా సినిమాలలో నటించిన ఈయన 7 నంది అవార్డులు కూడా గెలుచుకున్నాడు. ఇకపోతే ఏఫ్ 2 లో వరుణ్ తేజ్ తో కలిసి బ్లాక్ బస్టర్ కామెడీ చేసిన వెంకటేష్ వెంకిమామ లో మాత్రం గుండెలు పిండేసే ఎమోషన్స్ తో అదరగొడతాడని టాక్.

 

 

వెంకటేష్ మార్క్ కామెడీ ఉన్నప్పటికీ.. వెంకటేష్ ఎమోషనల్ గా ప్రేక్షకులకు కంటతడి పెట్టిస్తాడని అంటున్నారు. వెంకటేష్ నాగ చైతన్య మధ్యలో వచ్చే ఎమోషన్ సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలవనున్నాయని తాజా సమాచారం. ఇదే కాకుండా వెంకటేష్ పాయల్ రాజపుట్ మధ్యన రొమాన్స్ కూడా హాట్‌గానే ఉంటుందని.., చైతు, రాశి ఖన్నాకన్నా వెంకీ జోడికి రొమాంటిక్ యాంగిల్ ఎక్కువని యూనిట్ చెబుతున్న మాట. ఇకపోతే నవంబర్ 23న చైతుకి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తూ చిత్రయూనిట్ అల్లుడు బర్త్‌డే గ్లింప్స్’ అంటూ విడుదల చేసిన వీడియో ఆకట్టుకునేలా ఉంది.

 

 

ఇక నా మేనల్లుడి లవ్ స్టోరీ టైటానిక్ రేంజ్‌లో ఉంటుందను కున్నాను.. కనీసం ఊళ్లో పడవ రేంజ్‌లో కూడా లేదురా’.. అని వెంకీ అంటే, ‘నేను మత్తులో ఉండి ఏం చెప్పానో, నువ్వు మందులో ఉండి ఏం విన్నావో.. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చెప్తా విను’ అంటూ చైతు చెప్పడంతో ఈ గ్లింప్స్ స్టార్ట్ అవుతుంది. ‘వాడు రోజూ దాటే గీత మనం ఒక్కసారి దాటితే ఎలా ఉంటుందో చూపించొస్తాను సార్’ అంటూ చైతన్య చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది.

 

 

అదీగాక చైతు, రాశీ ఖన్నా కెమిస్ట్రీ బాగుంది. మామా అల్లుళ్ల మధ్య సరదా సంఘటనలు, మనసుని హత్తుకునే సెంటిమెంట్ సీన్స్ సినిమాలో హైలెట్ కానున్నాయట. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. ఈ గ్లింప్స్ అక్కినేని, దగ్గుబాటి ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. చైతు క్యారెక్టర్‌కి కార్తీక్ బాగా కలిసొచ్చిన పేరు.. ‘ఏమాయ చేశావే’ లో తన క్యారెక్టర్ పేరు కార్తీకే. మళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందని అక్కినేని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: