డైరెక్టర్ సుకుమార్ కొత్త సినిమా రావడానికి మరో ఏడాది టైం పడుతోందా?  ఇప్పటికే రెండేళ్లు ఆగిన ఈ డైరెక్టర్ న్యూ మూవీ ఎందుకు ఆలస్యమవుతోంది. ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన సుకుమార్ కొత్త సినిమాకు అడ్డంకులేంటి ? ఓపెనింగ్ జరుపుకున్న సుకుమార్, అల్లు అర్జున్ సినిమా ఇప్పటికే  సెట్స్ పైకి వెళ్లకపోవడానికి కారణాలేంటి ?

 

దర్శకుడు సుకుమార్ రంగస్థలంతో ఇండస్ట్రీ హిట్ కొట్టినా రెండేళ్లు ఆగాల్సి వచ్చింది. నిజానికి కెరీర్ స్టార్టింగ్ నుండి ఈ దర్శకుడు సినిమా సినిమాకు కనీసం రెండేళ్లు గ్యాప్ తీసుకుంటున్నాడు. అందుకే 14ఏళ్లు కెరీర్ లో సుకుమార్ కేవలం 7 సినిమాలు మాత్రమే చేయగలిగాడు. అయితే రంగస్థలం సినిమాతో నాన్ బాహుబలి రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ డైరెక్టర్ న్యూమూవీ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. సుకుమార్, బన్నిల సినిమాలు రావడానికి మరో ఏడాది పడుతోందని తెలుస్తోంది. 

 

అల వైకుంఠపురం సినిమా వల్లే బన్ని, సుకుమార్ ల కొత్త సినిమా ఆలస్యమవుతోందని సమాచారం. అల వైకుంఠపురంలో సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో బన్ని డేట్ అండ్ నైట్ వర్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అల వైకుంఠపురంలో ఫినిష్ చేసే వరకు అల్లు అర్జున్, సుకుమార్ సినిమాను మొదలు పెట్టే అవకాశం లేదని వినిపిస్తోంది. దీన్ని బట్టి సుకుమార్, బన్నీ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత పట్టాలెక్కే అవకాశం ఉంది. 

 


రంగస్థలం విడుదలైన దాదాపు రెండేళ్లకు సుకుమార్, బన్నీతో మూవీ చేస్తున్నాడు. ఎంత లేదన్నా షూటింగ్ కోసం ఈ టెక్నికల్ డైరెక్టర్ ఏడు, ఎనిమిది నెలలు సమయం తీసుకుంటాడు. ఈ లెక్క చూసుకుంటే సుకుమార్, బన్నిల సినిమా రిలీజ్ కావడానికి ఈజీగా ఏడాది టైం పడుతోంది. ఇండస్ట్రీ హిట్ సుకుమార్ కు ఇంత గ్యాప్ రావడం నిజంగా బ్యాడ్ లక్ అనే చెప్పాలి. 

 

 

 

 

 

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: