మనము సంవత్సరం చివరాకరికి చేరుకున్నాము. 2019లో ఎప్పటిలాగానే టాలీవుడ్లో చాలా సినిమాల సందడి చేసాయి. డిసెంబర్ లో కూడా వెంకటేష్ వెంకి మామ తో వస్తున్నాడు, అలాగే సాయి ధరమ్ తేజ్ కూడా ప్రతి రోజు పండగే సినిమాతో మనందరికీ ముందరికి వస్తున్నాడు. కానీ, ఈ సంవత్సరం రిలీజ్ అయిన సినిమా లో ఏ సినిమాలు బాగున్నాయో ఇప్పుడు మనం చూద్దాం. 2019లో చిన్న పెద్ద సినిమాలతో కలిపి 200 పైగా సినిమాలు ఈ సంవత్సరం విడుదల అయ్యాయి. వీటిలో హిట్ అయిన సినిమాలు మనం చూద్దాము.

 

సంక్రాంతి రిలీజ్ అయిన f2 సినిమా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సూపర్ హిట్  కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకి దాదాపు రెండింతలు రాబడి వచ్చింది. ఆ తర్వాత ఏప్రిల్లో వచ్చిన మజిలీ సినిమా ప్రేక్షకుల మనసును గెలిచింది. పెళ్లయిన తర్వాత కలిసి నాగచైతన్య, సమంత కలిసి నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది.  ఇదే నెలలో వచ్చిన చిత్రలహరి కూడా సాయి ధరం తేజ్ ఆరు సినిమాల పరాజయాలకు బ్రేక్ చేసిందని చెప్పాలి. హీరో ,హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ చాలా బాగా పని చేసిందని చెప్పాలి. చాలా రోజుల తర్వాత సునీల్ కూడా మంచి పాత్ర ఈ సినిమాలో లభించింది.

 

 ఏప్రిల్ లోని రిలీజ్ అయిన జెర్సీ సినిమా కూడా మంచి విజయం సాధించింది. కానీ కలెక్షన్  అంతగా రాలేదనే చెప్పాలి. ఇక మండు వేసవిలో మే 9న మహర్షి అంటూ మహేష్ బాబు మనందరి ముందుకి వచ్చాడు మహేష్ బాబు కాలేజ్ సీన్స్ చాలా బాగా వచ్చాయి. కానీ, ఈ సినిమా కూడా ఓవర్ సీస్ లో కలెక్షన్స్ అంతగా రాలేదనే చెప్పాలి. జూన్ నెలలో వచ్చిన చిన్న సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా మంచిగా ఆకట్టుకుంది. డిటెక్టివ్ పాత్రలో నవీన్ పొలిశెట్టి మంచి నటన చేసాడు. అదే నెలలో వచ్చిన బ్రోచేవారెవరురా సినిమా కూడా మంచి విజయం సాధించింది.  ఇక జూలై వచ్చేసరికి సమంత ఈ సారి ఓ బేబీ అంటూ మనందరి ముందరికి వచ్చింది. కొరియన్ రీమేక్ అయిన ఈ చిత్రం తో సమంత ఆ సోలోగా హిట్ కొట్టింది. అదే నెలలో రిలీజ్ అయిన ఇస్మార్ట్ శంకర్ కూడా మంచి సాధించి డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి మరో లైఫ్ ఇచ్చిందని చెప్పాలి.

 

 ఇక ఆగస్టులో ఐదేళ్లుగా హిట్ కోసం తపిస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ కూడా రాక్షసుడు సినిమాతో మంచి విజయం సాధించాడు. ఇండిపెండెన్స్ డే నాడు వచ్చినా ఎవరు సినిమా కూడా అడవి శేషు కు మంచి విజయాన్ని అందించింది. ఇక సెప్టెంబర్ లో రిలీజ్ అయిన గద్దలకొండ గణేష్ కూడా మాస్ ఎలివేషన్స్ తో మంచి విజయాన్ని అందుకుంది. ఇక అక్టోబర్ 2వ తారీఖున టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం సైరా నరసింహారెడ్డి సినిమా రిలీజ్ అయింది కథాంశం బాగున్నా కూడా ఈ సినిమా అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: