ప్రస్తుతం సినీ పరిశ్రమ వారసులతో కళకళలాడుతోంది. వారసత్వంతో వచ్చినా వీరిలో టాలెంట్ కూడా పుష్కలంగా ఉండటంతో సినిమాల్లో రాణిస్తున్నారు. వారిలో అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన మూడో తరం కూడా ఉంది. అలాగే దగ్గుబాటి ఫ్యామిలీ కూడా మూడో తరంలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ రెండు కుటుంబాల హీరోలైన మామా అల్లుళ్లు ప్రేక్షకులను రంజింపజేసేందుకు వస్తున్నారు. వెంకీ మామ అనే టైటిల్ తో ఈ నెల 13న సందడి చేయబోతున్నారు.

 

 

వెంకటేశ్ - నాగ చైతన్య ఇద్దరూ నిజ జీవితంలో కూడా మామా అల్లుళ్లే. 2016లో వచ్చిన నాగ చైతన్య ప్రేమమ్ సినిమాలో వెంకటేశ్ ఓ చిన్న పాత్రలో నటించాడు. సినిమాలో ఆ సీన్ మంచి బూస్టప్ తీసుకొచ్చిందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో పూర్తిస్థాయిలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. నాగ చైతన్య మిలిటరీ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుంటే.. వెంకీ గ్రామీణ వాతావరణంలో కనిపిస్తున్నాడు. మామా అల్లుళ్ళ సరదాను వారి ఇంటికే పరిమితం చేయకుండా సినీ ప్రేక్షకులకు కూడా పంచనున్నారు. వెంకటేశ్ కు జోడీగా పాయల్ రాజ్ ఫుత్ నటిస్తూండగా.. నాగ చైతన్య సరసన రాశి ఖన్నా నటిస్తోంది. పల్లెటూరు సందళ్ళు, పండుగ సంబరాలు, కుటుంబాల కేరింతలతో ఈ సినిమా ప్రేక్షకులకు వినోదం అందించబోతోందని తెలుస్తోంది. 

 

 

వెంకటేశ్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేం లేదు. నాగ చైతన్య నటనలో రాటుదేలుతూ హిట్స్, ప్లాఫ్స్ కు అతీతంగా ముందుకు సాగుతున్నాడు. సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత రామానాయుడు కూడా వెంకటేశ్, చైతూతో కలిసి సినిమా చేయాలని అనుకునేవారు. ఆయన కోరికను నేడు మామా అల్లుళ్లు తీరుస్తున్నారనే చెప్పాలి. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమా అనేక విడుదల తేదీలతో కన్ఫ్యూజ్ చేసినా ఎట్టకేలకు విడుదలవుతోంది. మామా అల్లుళ్ళ సందడి ఎలా ఉండబోతోందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: