ఈ రోజుల్లో ఎవ్వ‌రైనా అందంగా క‌నిపించాల‌నుకుంటారు. అందులోనూ ఆడ‌వారికి అందంపైన మ‌రికాస్త ఇంట్రెస్ట్ ఎక్కువ‌. అలా అందంగా క‌నిపించండం కోసం ఇష్ట‌మొచ్చిన కాస్మిటిక్స్ అన్నీ వాడుతుంటారు. కానీ వాటిలో కొన్ని నిల్వ ఉండేవి కూడా ఉంటాయి. అవి ఎప్పుడు ఎలా వాడాలో తెలుసుకుని వాడ‌డం ఎంతో మంది. ఐబ్రో పెన్సిల్, లిప్ స్టిక్, ఫౌండేషన్, బాడీ లోషన్ ఇలా ప్రతీ ఒక్క దాన్ని ఉపయోగిస్తుంటారు. ఇందులో ఏవీ ఎంతవరకూ వాడాలో తెలుసుకుందాం.

అందంగా కనిపించేందుకు మార్కెట్లో ఎన్నో ఐటెమ్స్ దొరుకుతుంటాయి. కళ్లకి, పెదాలకి, మొత్తం ముఖానికి ఇలా మేకప్ ఐటెమ్స్ వాడుతుంటారు. అయితే, ప్రతీ వస్తువు వాడటానికి ఓ టైమ్ అంటూ ఉంటుంది. ఆ సమయంలో వరకే వాడడం చాలా మంచిది. అంతకు మించి వాడితే లేనిపోని సమస్యలు ఎదురవుతాయి. ఇది మనం గమనిస్తే ఆ ప్రొడక్ట్స్‌పైనే ఉంటాయి. అయితే, నిపుణులు చెబుతున్న దాని ప్రకారం కొన్ని ప్రొడక్ట్స్ ఎంత కాలం వరకూ వాడాలో ఇప్పుడు చూద్దాం..

ఐబ్రో పెన్సిల్..

కనుబొమ్మలను ఒత్తుగా తీరైన ఆకృతిలో కనిపించేందుకు ఐబ్రో పెన్సిల్‌ని వాడుతుంటారు. వీటిని వాడడం వల్ల కనుబొమ్మలు ఎంతో అందంగా కూడా కనిపిస్తాయి. అయితే, ఈ పెన్సిల్‌ని ఎన్నిరోజుల వరకూ వాడొచ్చు అంటే.. ఓ పెన్సిల్‌ని రెండు సంవత్సరాల వరకూ వాడొచ్చు. నిజానికీ ఐబ్రో పెన్సిల్‌ని రెగ్యులర్‌గా యూజ్ చేస్తే అంత సమయం వరకూ రాకపోవచ్చు. కానీ, తీసుకున్న తర్వాత ఓ రెండు సంవత్సరాల వరకూ ఈ పెన్సిల్‌ని యూజ్ చేయొచ్చు.

 

లిప్‌స్టిక్..

లిప్ స్టిక్ అనేది ఒక సంవత్సరం వరకూ వాడొచ్చు. అంతకు మించి వాడొద్దు.. దీన్ని రెగ్యులర్‌గా వేసుకుంటే ఇది కూడా అన్నీ రోజులు రాదు.. కానీ, కొంతమంది రెగ్యులర్‌గా వేసుకోరు. మరి కొంతమందికి ఎన్నో కలర్స్ ఉంటాయి. వీటిలో ఒక్కోసారి ఒక్కో కలర్ లిప్ స్టిక్ వాడుతారు. దీని వల్ల అది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అయినప్పటికీ.. అలా ఉన్నా సంవత్సరానికి మించి వాడొద్దు. ఇలా వాడితే పెదాలు నల్లగా మారడం, పగలడం, పొడిబారడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ఎక్కువరోజులు వాడకపోవడమే మంచిది.

 

మస్కారా..

కనురెప్పలను పొడవుగా అందంగా కనిపించేలా చేసే మస్కారాని కూడా ఎక్కువ కాలం వాడొద్దు.. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం మస్కారాని మూడు నెలల లోపే వాడాలి. అంతకు మించి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడొద్దు. అదే విధంగా కొంతమంది ఇలాంటి ప్రొడక్ట్స్‌ని వేడి ప్రదేశాల్లో పెడుతుంటారు. అలా పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల అవి వాటి సహజతత్వాన్ని కోల్పోతాయి. కాబట్టి ఎప్పుడూ కూడా మేకప్ ప్రొడక్ట్స్‌ని వేడి ప్రాంతంలో పెట్టకూడదు.

 

పెర్ఫ్యూమ్..

చాలా మంది ఎంతో ఇష్టంగా పెర్ఫ్యూమ్ వాడుతారు. కొంతమందికి ఇది అంతగా ఇష్టముండదు. అందుకే అంతలా వాడరు. ఎప్పుడో ఓ సారి పెర్ఫ్యూమ్ వాడతారు. అలాంటివారికి పెర్ఫ్యూమ్స్ ఎక్కువ రోజులు వస్తాయి. అలాంటప్పుడు వాటిని ఉన్నాయి కదా అని సంవత్సరాలు సంవత్సరాలు వాడొద్దు. నిజానికీ సంవత్సరానికి మించి పెర్ఫ్యూమ్స్ స్మెల్స్ రావు. కాబట్టి.. వీటిని సంవత్సరంలోపే వాడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: