మన భారత దేశాన్నంతా కుదిపేసిన షాద్‌నగర్‌ దిశ అత్యాచారం, హత్య ఘటనపై జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ హీరో పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై సీనియర్ నటుడు సుమన్‌ మండిపడ్డారు. మహిళలపై అత్యాచారం చేసిన వారికి రెండు దెబ్బలు చాలనటం దారుణమన్నారు. అలాంటి ఘటనలు వారింట్లో జరిగితే పవన్‌ ఇలాగే అంటారా అని పవన్ ని సూటిగా ప్రశ్నించారు. ఈ సంఘటనపై ఇటీవల సుమన్‌ స్పందిస్తూ.. ఇలాంటి ఘటనల్లో బాధితుల ఆవేదనను అర్థం చేసుకుని మాట్లాడాలని పవన్‌కు హితబోధ చేసినట్టు మాట్లాడారు. అదే విధంగా అత్యాచార నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

ఇక దిశ ఘటన గురించి పవన్‌ కళ్యాణ్... 'వైద్యురాలిపై అత్యాచారం చేసిన నలుగురిని జైల్లో పెడితే.. జైలు దగ్గరకు వేలమంది వెళ్లి.. ఉరితీయాలని, చంపేయాలని అంటున్నారు. ఢిల్లీ స్థాయిలో ఓ జడ్జి రేప్‌ కేసు గురించి మాట్లాడుతూ మగవాళ్ల మర్మాంగాలను కోసేయండన్నారు. అంత స్థాయికి ఎందుకు తీసుకువెళుతున్నారు. ఆడపిల్ల బయటకువెళ్లి ఇంటికి తిరిగిరాకపోతే.. ఆడపిల్ల మీద ఏదైనా జరిగితే.. చేసిన అబ్బాయిని రెండు బెత్తం దెబ్బలు చెమ్డాలు ఊడిపోయేలా కొట్టాలి. అందరూ చూస్తుండగా కొట్టాలి' అని పవన్‌ మాట్లాడిన విషయం తెలసిందే. అయితే ఇది ఆలోచించి మాట్లాడారో..లేక ఆవేశంతో మాట్లాడారో ఎవరీ అర్థం కాకపోవడం గమనర్హం. 

 

పవన్ కళ్యాణ్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి అంతటి వారు కూడా దిశ ఘటన పై స్పందిస్తూ ఇలా చేసిన వాళ్ళని నడి రోడ్డు మీద ఉరి తీయాలాని ఎమోషనల్ అవుతూ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అలాంటిది పవన్ అన్న మాటలో అసలు బాధ కనిపించలేదని చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో పవన్‌ వ్యాఖ్యలపై మహిళలు, మేధావులు, రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. పవన్‌ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చిన్న చిన్న విషయాలకే అరిచి గగ్గోలు పెట్టి నిరసనలు తెలిపే పవన్ ఇలా ఇంత పెద్ద సంఘటన మీద చేసిన వ్యాఖ్యలు మరీ విచిత్రంగా ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు. 

  

 

మరింత సమాచారం తెలుసుకోండి: