ప్రస్తుతం థియేటర్ల వద్ద సినిమాల సందడి కనిపించట్లేదు. దసరా తర్వాత థియేటర్లలోకి పెద్ద సినిమాలేవీ రాలేదు. దీపావళికి తెలుగు సినిమాలేవీ రిలీజ్ కాకపోవడంతో తమిళం నుండి అనువాదం అయిన చిత్రాలు బాక్సాఫీసును షేక్ చేశాయి. అయితే ఈ గ్యాప్ చాలా చిన్న సినిమాలకి కలిసి వచ్చింది. పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో చిన్న సినిమాలన్నీ ఆ అవకాశాన్ని బాగా ఉపయోగించుకున్నాయి.

 

 

ప్రస్తుతం మరో వారం రోజుల వరకు థియేటర్లలోకి పెద్ద సినిమాలేవీ విడుదల కావట్లేదు. రూలర్, ప్రతిరోజూ పండగే, వెంకీమామా చిత్రాలలో వెంకీ మామ చిత్ర్రం డిసెంబర్ ౧౩ వ తేదీన విడుదల అవుతుంది. అప్పటి వరకు థియేటర్లలో నడిచేవన్నీ చిన్న సినిమాలే. వెంకీమామా చిత్రం విడుదలకి ఇంకా వారం రోజులు సమయం ఉండడంతో, ఈ శుక్రవారం అనగా రేపు ఆరు చిన్న సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి.

 

 


ఆరు సినిమాల్లో  కార్తికేయ నటించిన ’90 ఎంఎల్’, శ్రీనివాస రెడ్డి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’, ఐశ్వర్య రాజేష్, ఉదయ్ శంకర్ కలిసి నటించిన ‘మిస్ మ్యాచ్’ చిత్రాలు కొద్దో గొప్పో ప్రాచుర్యం నడుమ విడుదలకానుండగా ‘అశ్వమేథం, వజ్రాల వేట, మేరా దోస్త్, కలియుగ’ లాంటి చిత్రాలు కూడా బరిలో ఉన్నాయి. అలాగే హిందీ ప్రేక్షకుల కోసం ‘పానిపట్’ లాంటి సినిమా కూడా విడుదలకానుంది.

 

 

ఈ సినిమాలన్నింటిలో ఏది విజేత కానుందో రేపటితో తెలిసిపోతుంది. ఈ ఆరు సినిమాల్లో కార్తికేయ నటించిన ’90 ఎంఎల్’ , శ్రీనివాసరెడ్డి దర్శకత్వం చేసిన భాగ్యనగర వీధుల్లో గమ్మతు సినిమాకి ఎక్కువ బజ్ ఏర్పడింది. మరి పెద్ద సినిమాలు లేని ఈ సీజన్ ని చిన్న సినిమాలు ఎంత మేరకు ఉపయోగించుకుంటాయో చూడాలి. కాలం కలిసొస్తే ఈ చిన్న సినిమాల పంట పండినట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి: