'నాకు 55 యేళ్ల వయసు వచ్చాకా.. సినిమాల్లో ఇరవై రెండేళ్ల కుర్రాళ్లతో రొమాన్స్ చేయమని డైరెక్టర్ చెబితే  చేయను...' అని అంటోంది సోనాక్షి సిన్హా! ఈ మాట ఎవరికి తగలాలో వారికి తగులుతూ ఉంది. బాలీవుడ్ లో అయినా.. టాలీవుడ్ లో అయినా..యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో యాభై, అరవై సంవత్సరాల వయసు హీరోలు కూడా కుర్ర భామలతో తెర మీద రొమాన్స్ చేస్తూ కనిపిస్తూ ఉంటారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్..ఇలా అన్నీ చోట్లా ఈ ఛండాలం చూస్తున్నదే. అందుకే కొన్ని సినిమాలకు జనాలు వెళ్ళడమే మానేసారు. ఎంచక్కా ఇంట్లో కూర్చొని టీ.వీ సీరియల్స్ చూసుకుంటున్నారు. 

 

సౌత్ లో అయినా నార్త్ లో అయినా అదే నీచమైన పరిస్థితి. చాలా మంది హీరోల వయసు యాభై దాటింది! అరవై దాటాకా కూడా ఇంకా కొంతమంది హీరోలు తెర మీద హీరోయిన్స్ తో రొమాన్స్ కి లిప్ లాక్స్ కి రెడి కావాలంటున్నారు. ఆ సీన్లే ఎబ్బెట్టుగా ఉంటున్నాయి. అయినా ఈ ముసలి హీరోలు మాత్రం మొహమాట పడటం లేదు. షష్టిపూర్తి చేసుకుని ఐదారేళ్ల తర్వాత కూడా ఇంకా తొలి ప్రేమ సన్నివేశాల్లో నటిస్తూ నవ్వుల పాలవుతున్నారు.

 

ఇలాంటి క్రమంలో సోనాక్షి సిన్హా ఇలా హాట్ కామెంట్స్ చేసింది. తనకే గనుక యాభై ఐదేళ్లు వచ్చాకా సినిమాల్లో నటించే అవకాశం ఉంటే, అప్పుడు ఇరవై రెండేళ్ల కుర్రాళ్లతో తెరపై రొమాంటిక్ సీన్లలో నటించనని వ్యంగ్యంగా చెప్పింది సోనాక్షి. యాభై ఐదేళ్ల హీరోలు, ఇరవై రెండేళ్ల అమ్మాయిలకు జతగా నటిస్తుండటాన్ని సోనాక్షి ఇలా ప్రస్తావించింది. తమ కూతురు వయసున్న అమ్మాయిలతో రొమాన్స్ చేసే హీరోలపై సోనాక్షి ఇలా పంచ్ వేసింది! ఎంతైనా షాట్ గన్ కూతురు కదా! చాలామందికి ఈ బుల్లెట్ బాగానే తగిలుంటుంది. ఇక ప్రస్తుతం సోనాక్షి సల్మాన్ ఖాన్ తో మరోసారి దబాంగ్ 3 లో నటిస్తోంది. ఈ సినిమాకి ప్రభుదేవ దర్శకత్వం వహిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: