బాలీవుడ్ స్టార్ హీరో.. ప్రస్తుతం వరుస హిట్స్ తో దూసుకుపోతున్న అక్షయ్ కుమార్ గత రెండేళ్ళుగా ఫ్లాప్ ఎలా ఉంటుందో చూడలేదు. అలా అని కమర్షియల్  సినిమాల వెంట, స్టార్ డైరెక్టర్స్ వెంట, భారి బడ్జెట్ సినిమాల కోసం వెంపర్లాడలేదు. ఈ రెండేళ్ళలో అక్షయ్ నుంచి వచ్చిన సినిమాలన్ని సామాజిక అంశంతో వచ్చి సూపర్ హిట్స్ ని అందుకున్నవే కావడం విశేషం. జాలీ ఎల్.ఎల్.బి, టాయిలెట్ ఏక్ ప్రేం కథ, ప్యాడ్ మ్యాన్, మిషన్ మంగళ్..ఇవన్ని అక్షయ్ లిస్ట్ లో చేరిన బ్లాక్ బస్టర్లే. అయితే తాజా అక్షయ్ ఒక విషయంలో చాలా ఆవేదన చెందాడు.

 

మీడియా బాధ్యతగా వ్యవహరించాలని, తప్పుడు వార్తలు రాయకూడదని రిక్వెస్ట్ చేస్తున్న్నాడు అక్షయ్ కుమార్. కొన్ని సార్లు అవే తప్పుడు వార్తలు కొందరి జీవితాలను, కెరీర్‌ను నాశనం చేస్తుంటాయని వెల్లడించాడు. ఒక సెలబ్రిటీ గురించి రాసేముందు మీడియా జాగ్రత్తగా, బాధ్యతగా వ్యవహరించాలని కొన్నిసార్లు అలాంటి గాసిప్స్ టైంపాస్ అవ్వచ్చు.. కానీ కొన్ని సందర్భాల్లో జీవితాలను, కెరీర్‌లను నాశనం చేస్తాయంటు ఎమోషనల్ గా మాట్లాడారు. అలాంటి తప్పుడు వార్తల వల్ల నా కళ్లముందే ఎన్నో కాపురాలు కూలిపోయాయి. అయితే అందరూ తప్పుడు వార్తలే రాస్తారని నేను అనడంలేదు...అంటూ తన అనుభావలను పంచుకున్నారు. 

 

ప్రపంచవ్యాప్తంగా 80 లక్షల మంది పిల్లలు ఐవీఎఫ్ పద్ధతి ద్వారానే పుడుతున్నారు. సంతానలేమితో బాధపడుతున్నవారికి ఐవీఎఫ్ ఓ వరం. కానీ ఈ పద్ధతి గురించి తెలీనివారు చాలా మంది ఉన్నారు. మా సినిమా ద్వారా ఆ పద్ధతి గురించి ఎంటర్‌టైనింగ్ గా చెప్పాలనుకుంటున్నాం. దర్శకుల్లో ఉన్న టాలెంట్ ని మాత్రమే నేను చూస్తాను. నేను ఎక్కువగా కొత్త దర్శకులతోనే పనిచేస్తాను. ఎందుకంటే పెద్ద దర్శకులు నాతో కలిసి పనిచేయరు. అదీకాకుండా కొత్త దర్శకుల్లో ఏదన్నా సాధించాలన్న తపన, కసి ఇంకా ఎక్కువగా ఉంటుంది. నేను 20 మంది దర్శకులతో కలిసి పనిచేశాను. అనుభవం ఉన్న డైరెక్టర్స్‌తో కలిసి పనిచేసినా కూడా రిస్క్ ఉంటుందని ఆ తర్వాతే నాకు తెలిసింది. 

 

అంతేకాదు ఇప్పటి నుంచి లిమిటెడ్ బడ్జెట్ సినిమాలే చేయాలనుకుంటున్నాను. కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు తీస్తే అవి ఆడకపోవచ్చు. అప్పుడు నిర్మాతకు నష్టం వస్తుంది. ఆ విషయం ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాల విషయంలో జరిగిన సందర్భాలను ప్రత్యక్షంగా చూశాను మంచి కాన్సెప్ట్ ఉన్నప్పుడు లిమిటెడ్ బడ్జెట్‌తో తీస్తే లాభాలు వస్తాయి. ఇప్పుడు నేను నటించిన 'గుడ్ న్యూ్స్' సినిమాను కేవలం 37 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. నా గత చిత్రల బడ్జెట్ కూడా ఇంచు మించు ఇంతేనని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: