అర్జున్ సురవరం తలభారం దిగిపోవడంతో నిఖిల్ మళ్లీ జోరు పెంచుకున్నాడు. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై ఈ యంగ్ హీరో ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ చేయబోతున్న నిఖిల్ బిగ్ ప్రొడక్షన్ హౌజ్ లో ఫాంటసీ మూవీ చేస్తున్నట్టు సమాచారం. నిఖిల్ చేయనున్న న్యూ మూవీస్ లిస్ట్ ఏంటో ఓ సారి పరిశీలిస్తే.. !


హీరో కెరీర్ లో అయినా ఓ వరెస్ట్  ఫేజ్ ఉంటుంది.  అర్జున్ సురవరం సినిమాతో నిఖిల్ అలాంటి ఫేజ్ ఫేస్ చేశాడు. ఎన్నో మలుపులు తర్వాత అర్జున్ సినిమా ఇటీవలే రిలీజైంది. ఈ సినిమా ఈ కుర్రహీరో కెరీర్ ఏమైపోతుందో అనే భయం పుట్టించింది. ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ అవ్వడంతో నిఖిల్ హెడ్డెక్ తగ్గిపోయింది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో మళ్లీ జెట్ స్పీడ్ తో సినిమాలు చేసేందుకు రెడీ అయిపోతున్నాడు. 


నిఖిల్ కార్తికేయ 2తో పాటు మరో రెండు సినిమాలు కన్ఫార్మ్ చేసినట్టు తెలుస్తోంది. ముందుగా చందుముండేటి దర్శకత్వంలో కార్తికేయ సీక్వెల్ చేయబోతున్నాడు. త్వరలోనే సినిమా పట్టాలెక్కుతోందని సమాచారం. మొదటి భాగానికి మించిన సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో దర్శకుడు చందుమొండేటి రెండో భాగం స్టోరీని రెడీ చేశారట. కార్తికేయ సీక్వెల్ తర్వాత నిఖిల్, డైరెక్టర్ వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మిస్తుండటం విశేషం. 


అదే విధంగా నిఖిల్ హనుమాన్ టైటిల్ తో ఫాంటసీ సినిమా చేయబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా దర్శకుడు ఎవరనేది ఫైనల్ కాలేదు. అలాగే ఇంతకుముందు నిఖిల్ శ్వాస అనే మూవీని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అప్పుడు స్టోరీ చెప్పి మరో వెర్షన్ తీస్తున్నారని నిఖిల్ ఆ సినిమాను మధ్యలోనే వదిలేశాడు. ఇప్పుడు అదే మేకర్స్ తో ఈ యంగ్ హీరో మరో కొత్త సినిమా చేయబోతున్నాడట. అర్జున్ సురవరంతో వచ్చిన ఏడాదిన్నర గ్యాప్ ని నిఖిల్ ఒకేసారి మూడు సినిమాలతో ఫుల్ ఫిల్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: