బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్.. నిత్యామీనన్.. రమ్యకృష్ణ.. ఈ ముగ్గురు స్టార్ హీరోయిన్స్ ని అమ్మ జయలలిత పాత్రలో చూడబోతున్నాం. ఇప్పటికే నిత్యామీనన్ 'ది ఐరన్ లేడీ' ఫస్ట్ లుక్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.. అమ్మ పాత్రకు నిత్యా పర్ఫెక్ట్ గా సూటయిందని ప్రశంసల వర్షం కురిపించారు. ఇక రీసెంట్‌గా 'తలైవి' గా కంగన లుక్ కూడా వచ్చింది. మోషన్ పోస్టర్ కం టీజర్ చూడగానే అభిమానుల్లో రకరకాల కామెంట్లు వినిపించాయి. ఇందులో కంగన లుక్స్ పైనా చాలానే విమర్శలు వచ్చాయి. ఇక ప్రోస్థటిక్ మేకప్ పై ఊహించని కామెంట్లతో విరుచుకుపడ్డారు అమ్మ అభిమానులు. కంగన బొమ్మలా ఉందని వెకిలిగా కనిపించిందని ఏకంగా కొందరైతే తిట్టారు కూడా. 

 

సరిగ్గా ఇలాంటి టైమ్ లో 'క్వీన్' వెబ్ సిరీస్ తో గౌతమ్ మీనన్ బృందం బరిలో దిగడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఇందులో జయలలిత పాత్రలో రమ్యకృష్ణ లాంటి సీనియర్ నటి నటిస్తుండడంతో అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ లో అమ్మ ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతోంది? అని ఎదురు చూసిన వారికి ఏమాత్రం నిరాశకలిగించని అద్భుతమైన ట్రీట్ గౌతమ్ మీనన్ ఇవ్వబోతున్నారు. తాజాగా రమ్యకృష్ణ లుక్ రిలీజైంది. ఈ లుక్ ఫెంటాస్టిక్ అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి.

 

భారీ బడ్జెట్లతో సాహసం చేస్తున్న నిర్మాతల్లో గుబులు పుట్టేంతగా ఈ లుక్ పర్‌ఫెక్ట్ గా సెట్ అయింది. నీలాంబరిగా.. శివగామిగా మోస్ట్ పవర్ ఫుల్ పాత్రల్లో నటించి మెప్పించిన రమ్యకృష్ణ దివంగత ముఖ్యమంత్రి జయలలితగా మెప్పిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రమ్య ఈ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం ఖాయం. ఇక సౌతిండియాలోనే గ్రేట్ టెక్నీషియన్ గా పేరున్న గౌతమ్ మీనన్ తన శిష్య వర్గంతో సిద్దమై అమ్మ వెబ్ సిరీస్ ని తెరకెక్కిస్తుండడంతో ఇప్పుడు ఇతర బయోపిక్ లపై అది ఏమేరకు ప్రభావం చూపిస్తుందోనన్న అనుమానాలు మొదలయ్యాయి. మరి రెండు సినిమాలు హిట్ అవుతాయా..లేక వెబ్ సిరీస్ క్లిక్ అవుతుందా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: