వెంకటేష్ ... నాగ చైతన్య హీరోలుగా చేస్తున్న వెంకిమామ సినిమా డిసెంబర్ 13 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  సినిమాపై ఒకవైపు అంచనాలు ఉన్నాయి మరోవైపు భయం కూడా ఉన్నది.  ఈ సినిమా కోసం దాదాపుగా రూ. 35 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు.   వెంకీ, చైతు మార్కెట్ కు ఇది చాలా ఎక్కువ అని చెప్పాలి.  ఎఫ్ 2, మజిలీ సినిమాలు హిట్ కావడంతో పాటుగా, కథపై నమ్మకంతో ఈ సినిమాకు ఈ స్థాయిలో ఖర్చు చేశారు.  


ఇలా పెట్టిన డబ్బులు వెనక్కి తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.  ఈ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో అని ఎదురుచూస్తున్నారు.  సమాచారం ప్రకారం సినిమా తప్పకుండా హిట్ అవుతుందని అంటున్నారు. ఒకవేళ సినిమా కనుక హిట్టయితే.. మంచి వసూళ్లు సాధిస్తుంది.  ఫ్యామిలీ, మాస్ ఆడియన్స్ అందరిని ఆక

ట్టుకునే విధంగా సినిమా ఉంటుందని ఆశిస్తున్నారు.  
వెంకటేష్ ను పక్కా పల్లెటూరి వ్యక్తిగా చూపిస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు.  మరోవైపు చైతూను ఆర్మీ ఆఫీసర్ గా చూపిస్తూ మరో హైప్ క్రియేట్ చేయడం విశేషం.  సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు కాబట్టి సినిమాను భారీగా ప్రమోట్ చేయబోతున్నారు.  పైగా ఈ సినిమా సోలోగా వస్తున్నది.  సోలో సినిమా కొద్దిగా బాగుందనే టాక్ వస్తే చాలు వారం రోజులపాటు వసూళ్లు సాధించుకోవచ్చు.  


పెట్టిన డబ్బులను వెనక్కి తెచ్చుకోవచ్చు.  సింగిల్ గా రావడం కోసమే చాలా కాలం నుంచి వెయిట్ చేస్తూ చివరకు డిసెంబర్ 13 వ తేదీని ఫిక్స్ చేసుకున్నారు.  ఎలాగైతేనేం సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది.  దగ్గుబాటి, అక్కినేని అభిమానులు సంబరాలు చేసుకునే సమయం దగ్గరపడింది. ఈ సినిమా కనుక హిట్టయితే.. ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలు మరిన్ని వస్తాయని ఆశించవచ్చు.  చూద్దాం ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో.  

మరింత సమాచారం తెలుసుకోండి: