రామ్ గోపాల్ వర్మ గురించి చెప్పాలి అంటే ఎంతైనా చెప్పుకోవచ్చు.. శివ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేశారు.  టాలీవుడ్లో భారీ విజయాలు అందించారు.  ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లోవర్మను చూసి ప్రతి దర్శకుడు ఒకింత కలవరం చెందారు.  అసూయ కూడా పడ్డారు.  పదుల సంఖ్యలో సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకులకు రానిపేరు వర్మ ఒక్క సినిమాతో తెచ్చుకున్నారు.  ఆ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీ తలరాతను మార్చేసింది. 


వర్మ అంతటి సంచలనం సృష్టిస్తారని ఎవరూ నమ్మలేదు.  వర్మకు కూడా నమ్మకం లేదు ఆ సినిమా అలా ఆడుతుందని, సినిమాలో  చెప్పుకోవడానికి అందులో ఇది కథ అని ఏముండదు.. కేవలం సన్నివేశాలే.. ఆ సన్నివేశాలే కథను నడిపిస్తాయి.  సన్నివేశాల సమూహారమే సినిమా.  అంతేకత మరి.  ఆ సన్నివేశాలను తెలివిగా రాసుకోవడం... తెలివిగా వాటిని ఒకటిగా చేసుకోవడం.. ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమా తీయడం.. ఇదే సినిమా అంటే.  


అయితే, విజయం అన్నది ప్రేక్షకులు మెచ్చుకునే దాంట్లోనే ఉంటుంది.  శివ నచ్చింది కాబట్టి నెత్తిన పెట్టుకున్నారు.  శివ, క్షణక్షణం ఇలా కొన్ని సినిమాలు ఐకానిక్ గా నిలిచాయి.  దౌర్బాగ్యం ఏమంటే... ఇప్పుడు వర్మ తీస్తున్న సినిమాలు చూస్తుంటే ఇందులో ఏముంది అనిపిస్తుంది.  సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి టీజర్, ట్రైలర్ అన్ని కూడా, అబ్బో సినిమాలో చాలా ఉంది అనుకుంటాం.  ఎందుకంటే వర్మ అలా మాయ చేస్తాడు.  సినిమాలో మాత్రం ఏమి ఉన్నాడు.  ఒక్క రోజు సినిమా ఆడితే చాలు.  డబ్బులు వచ్చేస్తాయి.  


వర్మ సినిమా తీసే విధానం కూడా చాలా సింపుల్ గా ఫాస్ట్ గా ఉంటుంది.  ఇలా మొదలుపెట్టాడు అంటే ఆలా పూర్తైపోతుంది.  ఎప్పుడు తీశాడో ఎవరికీ తెలియదు.  నిత్యం వర్మ సోషల్ మీడియాలో బిజీ, బిజీగా కనిపిస్తూనే ఉంటాడు.  ఎప్పుడైన వర్మ... కనిపించలేదు అంటే ఎదో సినిమా చేస్తున్నాడు అని అర్ధం.. ఎన్ని రోజులు సోషల్ మీడియాలో కనిపించలేదు అన్ని రోజులు సినిమా షూటింగ్ బిజీలో ఉన్నాడని అర్ధం చేసుకోవాలి.  ఒకసారి షూటింగ్ స్పాట్ లోకి అడుగుపెడితే.. మిగతగా విషయాలు పట్టవు.  అదే షూటింగ్ నుంచి బయటకు వస్తే మరలా మాములే ... వివాదాస్పదం చేసుకుంటూ పోతాడు.  వర్మ.. ఇదేం ఖర్మరా అనుకోవమే తప్పించి మనం ఏమి చేయలేము.  అంతే... 

మరింత సమాచారం తెలుసుకోండి: