ఫ్లాపులొచ్చినా తట్టుకోగలరేమో గానీ, సినిమా హిట్టో, ఫ్లాపో తెలియకపోతేనే చాలా కష్టంగా ఉంటుంది. అసలు ఈ సిట్యుయేషన్ ని డీల్ చేయడం కూడా అంత ఈజీ కాదు. జాన్ అబ్రహాం ఇదే పరిస్థితుల్లో ఉన్నాడు. ఫలితం లేని పరీక్ష రాసినట్టు తెగ బాధపడిపోతున్నాడట. 

 

జాన్ అబ్రహాం ఏడాదికి రెండు, మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు. హీరో కమ్ ప్రొడ్యూసర్ గా చాలా కష్టపడుతున్నాడు. కానీ ఏడాదికి రెండు మూడు సినిమాలు వస్తున్నా.. సరైన హిట్ మాత్రం రావట్లేదు. కానీ బోనస్ గా నిరాశ నిస్పృహలొస్తున్నాయి. ఎలాంటి కథ పట్టుకున్నా.. కొలాప్స్ అవుతుందనే బాధ పెరుగుతోంది. 

 

బాలీవుడ్ లో ఈ మధ్య వైవిధ్యమైన కథలకు మంచి వసూళ్లు దక్కుతున్నాయి. దీంతో జాన్ అబ్రహాం కూడా కమర్షియల్ ఫార్మాట్ ని పక్కన పెట్టేశాడు. రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని సినిమాలు చేస్తున్నాడు. పరమాణు, బాట్లా హౌస్ లాంటి కథల్లో నటించాడు. కానీ ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. 

 

నాలుగు ఐదు ఏళ్లుగా జాన్ అబ్రహాం సరైన సక్సెస్ లేక చాలా డల్ అయ్యాడు. మార్కెట్ కూడా జాన్ సినిమాలకు మునుపటిలా ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. దీంతో ఈ హీరో రేంజ్ పడిపోతుంది. టాప్ రేస్ కు దగ్గరగా ఉండాల్సిన వాడు కాస్తా, మీడియం రేంజ్ హీరోల లిస్ట్ లో లాస్ట్ లో ఉంటున్నాడు. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే చిన్న హీరోల స్థాయికి పడిపోయే ప్రమాదముంది అంటున్నారు బాలీవుడ్ జనాలు . మొత్తానికి జాన్ అబ్రహాం హిట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఫ్లాప్ లు వచ్చినా సరే.. వాటినే మెట్లుగా ఎంచుకొని హిట్ సాధించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాడు. చూడాలి జాన్ అబ్రహాం పరిస్థితి ముందు ముందు ఎలా ఉంటుందో.. !

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: