గిల్లితే గిల్లించుకోవాలి అరవకూడదు... ఇది పోకిరి సినిమాలో డైలాగ్.. ఈ డైలాగ్ బాలయ్యబాబుకు కరెక్ట్ గా సరిపోతుంది. బాలయ్య మాస్ హీరో.. అయన డైలాగులు ఊరమాస్ గా ఉంటాయి.  అందుకే బాలయ్య సాఫ్ట్ క్యారెక్టర్ ఉన్న సినిమాలు చేయలేకపోతుంటాడు.  ముఖ్యంగా బిజినెస్ మెన్ సాఫ్ట్ పాత్ర అయన చేయలేదు.  బిజినెస్ మెన్ అంటే చాలా సాఫ్ట్ గా ఉండాలి.  తన బిసినెస్ కోసం అవసరమైతే తగ్గి ఉండాలి.  కానీ, బాలయ్య అలా ఉండలేదు.  


ఈ సంగతి అందరికి తెలుసు.  అందుకే బాలయ్యను అలా సాఫ్ట్ పాత్రల్లో చూపించేందుకు పెద్దగా ఎవరూ ఇష్టపడరు.  ఇప్పుడు రూలర్ సినిమాలో బాలయ్య ఓ కార్పరేట్ బిజినెస్ మెన్ గా ఓ పాత్రలో కనిపించబోతున్నారు.  కార్పొరేట్ బిజినెస్ మెన్ గా బాలయ్యను చూపించిన ఘనత దర్శకుడు కెఎస్ రవికుమార్ కు దక్కుతుంది అనడంలో సందేహం అవసరం లేదు. మహర్షి సినిమాలో మహేష్ బాబును బిజినెస్ మెన్ గా కొత్తగా చూపించారు.  


పాత్ర ఆకట్టుకుంటుంది.  అదే విధంగా ఇప్పుడు బాలయ్యను రూలర్ సినిమాలో బిజినెస్ మెన్ గా కొత్త గెటప్ లో చూపిస్తున్నారు.  వేషం, భాష, తీరు అన్ని కొత్తగా ఉన్నాయి.  గెటప్ కొత్తగా ఉండటంతో ఆసక్తి మొదలైంది.  ఒక్క క్లాస్ కు మాత్రమే కాదు, మాస్ కు నచ్చేలా ఇందులో చాలా ఉన్నాయట.  ఆ చాలా ఏంటి అన్నది సినిమాలో చూస్తే అర్ధం అవుతుంది. ఇకపోతే, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లోని ఎంజీఎం గ్రౌండ్స్ లో భారీ ఎత్తున ప్లాన్ చేశారు.  


ఈవెంట్ కు చాలా మంది ప్రముఖులు హాజరు కాబోతున్నారు.  వాళ్ళు ఎవరు అన్నది తెలియాల్సి ఉన్నది.  ఈ సినిమా డిసెంబర్ 20 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  డిసెంబర్ 14 వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది.  అదే రోజున సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తారు.  ఆ తరువాత రోజు నుంచి ప్రమోషన్ ఉంటాయి. ఎన్టీఆర్ బయోపిక్ ఇచ్చిన చేదు జ్ఞాపకాల నుంచి బయటపడాలి అంటే ఈ సినిమా హిట్ కావాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: