ఆర్.ఎక్స్.100 సినిమాతో రొమాంటిక్ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది పాయల్ రాజ్ పుత్. ఈ సినిమా హిట్ అవడంతో వెంట వెంటనే అవకాశాలు వచ్చాయి. వాటిలో వెంకటేష్, నాగ చైతన్యల వెంకీ మామా కాగా మరో సినిమా మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న డిస్కో రాజ. ఈ రెండు సినిమాలలో పాయల్ రెండు డిఫ్రెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తోంది. వెంకీ సినిమాలో కాస్త గ్లామరస్ గా కనిపిస్తూనే మాస్ రాజా సినిమాలో గన్ పట్టుకొని యాక్షన్ చేయబోతోంది. మన మాస్ రాజా లాస్ట్ సినిమా 'అమర్ అక్బర్ ఆంటోనీ' లాస్ట్ ఇయర్ నవంబర్లో  రిలీజ్ అయింది. ఈ సినిమా డిజాస్టర్ గా లిచింది. దాంతో మళ్ళీ ఇప్పటివరకూ రవితేజ నటించిన మరో సినిమా విడుదల కాలేదు. దీంతో మాస్ రాజా ఫ్యాన్స్ అందరూ కొత్త సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

 

ఇక రవితేజ ప్రస్తుతం వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కోరాజా' అనే విభిన్నమైనా కథా చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్.. నభ నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా నుండి పాయల్ పాత్ర కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ లో ఖాకి రంగు డ్రెస్ లో ఇంటెన్స్ లుక్ లో ఉన్న పాయల్  ఎవరికో పిస్టల్ గురిపెట్టింది. ఎప్పుడూ సరదాగా.. లేకపోతే హాటుగా ఉండే ఈ ఆరెక్స్ భామ ఏం మిషన్ పై ఉందో ఎందుకు.. ఎవరికి అలా తుపాకి ని గురిపెట్టిందో మనకు సినిమా చూస్తే కానీ తెలుస్తుంది. 

 

పాయల్ మొదటి సినిమా ఆర్.ఎక్స్.100 తోనే నటన విషయంలో మంచి మార్కులు తెచ్చుకుంది కాబట్టి ఈ సినిమాలో కూడా ఏదో ఒక పవర్ఫుల్ రోల్ చేస్తోందని ఈ పోస్టర్ చూస్తేనే అర్థం అవుతుంది. మరి ఈ సినిమాతో పాయల్ కు మంచి హిట్ దక్కుతుందో లేదో చూడాలి. ఇక ఈ సినిమాలో తాన్యా హాప్.. బాబీ సింహా.. వెన్నెల కిషోర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డిస్కో రాజా సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను ఎస్ ఆర్ టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: