కంగనా రనౌత్ ఎక్కడుంటే అక్కడ గొడవలుంటాయి. వివాదాలకు బ్రాండ్ అంబాసిడర్ కంగన. అందుకే ఈమెను టచ్ చేసేందుకు కూడా చాలామంది భయపడుతుంటారు. కానీ తాప్సీ మాత్రం కంగనాని టార్గెట్ చేస్తోంది. వాళ్లపై కౌంటర్లు పేలుస్తోంది. 

 

కంగన రనౌత్ తో పెట్టుకున్నోళ్ల పని మటాష్ అని చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. హృతిక్ రోషన్, క్రిష్ లాంటి వాళ్లు కంగనా దెబ్బకు సైలంట్ అయ్యారు. కంగనాకు ఎదురెళ్లడం అంటే కరెంట్ ప్లగ్ లో వేలు పెట్టడమే అనే అభిప్రాయముంది. ఇక కంగనా చెల్లెలు రంగోళి అయితే ట్వీట్స్ తో ఎదుటి వాళ్లపై విరుచుకుపడుతుంది. కంగనా పేరు కూడా పూర్తి కాకముందే పెద్ద మెసేజులతో రచ్చ చేస్తుంది. అలాంటి అక్కాచెల్లెళ్లకు ఎదురు వెళ్తోంది తాప్సీ. 

 

కంగనా చెల్లెలు రంగోళి తాప్సీపై చాలా సార్లు విరుచుకుపడింది. తాప్సీ, కంగనా రనౌత్ ని కాపీ కొడుతోందని, రింగులు జుట్టున్నంత మాత్రానా అందరూ కంగనా అయిపోయారని చాలా కామెంట్స్ చేసింది. తాప్సీ సినిమాలపైనా నెగిటివ్ గా మాట్లాడింది. సాండ్ కీ ఆంఖ్, టైంలో అయితే తాప్సీ పెర్పామెన్స్ పై నెగిటివ్ కామెంట్స్ చేసింది రంగోళి. 


తాప్సీ రీసెంట్ గా నేహా ధూపియా టాక్ షోకు అటెండ్ అయింది. అక్కడ కంగనా సిస్టర్స్ చేస్తోన్నకామెంట్స్ గురించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటికి తాప్సీ కొంచెం సెటైరిక్ ఆన్సర్ ఇచ్చింది. వాళ్లకు నేనంటే ప్రేమ అందుకే ఎప్పుడూ నా గురించే ఆలోచిస్తుంటారు. కానీ నాకు వాళ్లపై అంత ప్రేమ లేదు. నా సినిమాలను మాత్రమే ప్రేమిస్తాను. అందుకే వాళ్ల విమర్శలు నన్ను తాకట్లేదు అని చెప్పింది. మరి తాప్సీ కంగనా అండ్ కో ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఈ వ్యవహారం ఎంతవరకు దారితీస్తుందో..చూడాలి..! కంగనా సిస్టర్స్, తాప్సీ వ్యవహారం ఎంతవరకు దారితీస్తుందో..చూడాలి..!  దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: