రాధికా ఆప్టే బోల్డ్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాల్లో ఏకంగా న్యూడ్ గా కనిపించి తన ధైర్యం ఎంతో నిరూపించింది. అప్పుడప్పుడు రాధికా ఆప్టే సెక్స్ సీన్లు కూడా లీక్ అయినాయి. అయినా రాధికా ఆప్టే ఎక్కడ కూడా తగ్గడం లేదు. రక్త చరిత్ర, లెజెండ్, లయన్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను దగ్గరయింది బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రాధికా ఆఫ్టే. ఆమె ఎక్కువ బోల్డ్ సినిమాల్లో ఇప్పుడు కనిపిస్తోంది. బద్లాపూర్, అహల్య, లస్ట్ స్టోరీస్, వెడ్డింగ్ గెస్ట్ ఇలా ప్రతీ సినిమాల్లో అడల్ట్ సీన్స్‌లో నటించింది. తాజాగా ఇదే విషయంపై ఆమె ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలను చెప్పింది. ఓ దర్శకుడు కథ చెప్పడానికి వచ్చాడు.. అందులో తనది వేశ్య పాత్ర అని చెప్పాడు.

 

నేను నటించిన  సినిమాల వల్ల అందరూ అటువంటి పాత్రలే అడుగుతున్నారు. అదేంటని అడిగితే.. “మీరు నటించిన బద్లాపూర్, అహల్య సినిమాల్లో మీరు దుస్తులిప్పేసి అలాంటి పాత్రల్లోనే నటించారు కదా. వరుసగా అవే పాత్రల్లో నటిస్తున్నారు కదా’ అని అన్నాడని చెప్పుకొచ్చింది. అతని జవాబుకి తాను షాక్ అయ్యానని చెప్పింది. దేశంలో జరుగుతున్న అత్యాచారాల నేపథ్యంలో సినిమా తీస్తానని మరో డైరెక్టర్ తన వద్దకు వచ్చి.. అందులో తనది ముఖ్యమైన పాత్రని చెప్పాడని.. ఓ మహిళపై అత్యాచారం చేసిన వారిపై పగ తీర్చుకునేందుకు ఆమె కూడా రేపిస్ట్ గా మారిపోతుందనే ఓ పిచ్చి కాన్సెప్ట్ చెప్పాడని తెలిపింది.

 

దీనితో నాకు ఒళ్ళు మండిపోయి  ఆ సినిమాని రిజెక్ట్ చేసినట్లు తెలిపింది. హాలీవుడ్ నటుడు దేవ్ పటేల్ తో కలిసి ’వెడ్డింగ్ గెస్ట్’అనే మూవీ చేశాను. అందులో తనకు దేవ్ కు బోల్డ్ సీన్స్ ఉన్నాయని తెలిపింది. అందులో ఏకంగా తన వక్షోజాలు, ఇతర ప్రైవేట్ పార్ట్స్ కూడా చూపించేశారని చెప్పుకొచ్చింది. దాంతో తాను కేవలం సెక్స్ సీన్స్ ఉన్న పాత్రలోనే నటిస్తానని చాలా మంది అనుకున్నారని తెలిపింది. బోల్డ్ సీన్స్ ఉన్న కథలను అసలు ఒప్పుకోనని.. ఒకవేళ ఒప్పుకున్నా అందులో బలమైన కథ ఉంటే ఆలోచిస్తానని రాధికా స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: