సినిమా తారల్లో ఎవరి జీవితాలు ఎప్పుడు ఎలా మలుపులు తిరుగుతాయో ఎవరూ చెప్పలేరు. ఇక.. జీవిత భాగస్వామి విషయంలో అయితే కొందరి బాధలు వర్ణణాతీతంగా ఉంటాయి. మారిన కాలానికి అనుగుణంగా కొందరైతే సహజీవనం చేస్తూ తమ జీవితాన్ని కొనసాగిస్తుంటారు. అందులో కొందరు కోరి కోరి బాధలు కొని తెచ్చుకుంటారు. అలాంటివారిలో మలయాళీ నటి, మన దేశంలో మొట్ట మొదటి మలయాళీ నటి అంజలి సమీర్ ఒకరిగా నిలిచినట్టే కనిపిస్తున్నారు. ఇన్నాళ్లూ తాను ఓ వ్యక్తితో సహజీవనం చేసినట్టు స్వయంగా అంజలినే చెప్పుకొచ్చారు.

 

ఫేస్ బుక్ లో ఆమె పోస్ట్ చేసిన సందేశం ప్రకారం.. తాను ఓ వ్యక్తి చేతిలో మోసపోయినట్టు చెప్పారు. తనను మోసం చేసి మరీ సహజీవనం చేశాడన్నారు. అతను మంచివాడని అనుకున్నానని.. అయితే తాను చెడ్డవాడని తెలుసుకున్నానని.. అప్పటినుంచి వదిలేయాలని అనుకున్నా.. వేధిస్తున్నాడని ఆవేదన చెందారు.. అంజలి. అంతే కాదు.. తనపై యాసిడ్ దాడి కూడా చేస్తానని బెదిరిస్తున్నాడని.. తన బ్యాంకు ఖాతాలో దాచుకున్న 4 లక్షల రూపాయలనూ అన్యాయంగా వాడుకున్నాడని వాపోయారు. ఈ వేధింపులు తట్టుకోలేక.. తనకు చనిపోవాలని ఉందంటూ.. అంజలి చెప్పుకొచ్చారు.

 

ఇదంతా చూస్తున్నవారు.. సినిమా లైఫ్ లో ఇవన్నీ కామన్ అని లైట్ తీసుకోమని సలహా ఇస్తున్నారు. అయినా.. సెలెబ్రిటీ అయి ఉండి ఎందుకింత భయపడుతున్నావని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలా ఫేస్ బుక్ మెసేజ్ లు కాకుండా.. మీడియా ముందుకు వచ్చి అసలు విషయం చెప్పాలని.. చేతనైతే పోలీసుల సహాయం తీసుకోవాలని చెబుతున్నారు. అంతే కానీ.. ఇలా భయపడితే వచ్చే లాభం ఏదీ లేదని స్పష్టం చేస్తున్నారు. మంచి కెరీర్, ఇండస్ట్రీలో గుర్తింపు ఉన్నప్పుడు పాడు చేసుకోవడం సరికాదని హితవు పలుకుతున్నారు.

 

అలా కాదు కూడదంటే.. ఇప్పటివరకూ జరిగింది వదిలేసి.. హాయిగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తే అంజలికి మాత్రమే కాదు.. ఆమె బంగారం లాంటి భవిష్యత్తుకూ మంచిది. కాదంటారా..!

మరింత సమాచారం తెలుసుకోండి: