డార్లింగ్ అంటే ఎవరా? అని ఆలోచిస్తున్నారా !అదేనండి మన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అండి.. ప్రభాస్ మంచి భోజన ప్రియుడని తెలుసా మీకు? అలాగే ప్రభాస్ తినడమే కాదు ఎదుటివాళ్ళకు కూడా వామ్మో ఇంకా చాలు అనేలా  మెను ఉంటుందట. అ మెనులో ఉండే వంటకాల రకాలు చూస్తే ఎవరికన్నా నోరు ఊరిపోతుంది.


ప్రభాస్ పేరు ఎత్తగానే అందరు హీరోయిన్స్ చెప్పే విషయం తిండి గూర్చే. సెట్స్ లో హీరోయిన్స్ కి మంచి భోజనం పెట్టిస్తారట. మెను చూసి అందరికి నోట మాట రాదట. సాహో సినిమాలో శ్రద్ధా కపూర్  కి కూడా ఇలాంటి సర్ ప్రైజ్ ట్రీట్లు ఎన్నో ఇచ్చారంట. అలాగే డార్లింగ్ హీరోయిన్ కాజోల్ కూడా ప్రభాస్ ట్రీట్ ఎంజాయ్ చేసిందట.. మన స్వీటీ(అనుష్క) అయితే చెప్పక్కర్లేదు ఇలాంటి భోజనాలు ఎన్నో చేసి ఉంటుంది.


ఇప్పుడు ప్రభాస్ హీరోగా 'జాన్ ' సినిమా తెరకెక్కబోతుంది.. అందులో హీరోయిన్ గా పూజా హేగ్జే నటిస్తుంది... ఇపుడు పూజా కూడా ప్రభాస్ ఆదిత్యాన్ని స్వీకరించిందట. అవునండి ప్రభాస్ షూటింగ్ లో రోజూ పూజా కి లంచ్ బాక్స్ పంపిస్తున్నారట. ఆ  భోజనం చుసిన పూజా' ఏమి దొరకని ద్వీపానికి వెళ్ళిపోతాను !అక్కడ ఎవరు లేకపోయినా పర్వాలేదు నాతో ప్రభాస్ ఉంటే చాలు' అని అందట. అంతేకాదు" ప్రభాస్ నా పక్కన ఉంటే చాలు నేను భోజనం చేయడం మానేస్తా"అంది నవ్వుతూ.

ప్రభాస్ టేస్ట్ నా టేస్ట్ ఒకలానే ఉంటాయి. నాకు బిర్యానీ అంటే ఇష్టం. అలానే ప్రభాస్ కూడా బిర్యానీ ప్రియుడు. ఇంట్లో కాళిగా ఉంటే నేను మటన్ బిర్యానీ చేస్తాను. అంత ఇష్టం బిర్యానీ అంటే అని చెప్పుకొచ్చింది. ఎప్పుడన్నా బిర్యానీ తినాలనిపిస్తే వెంటనే ప్రభాస్ కి చెప్తాను.. వెంటనే బిర్యానీ వచ్చేస్తుంది.. కడుపునిండా తినేస్తాము... ప్రభాస్ లంచ్ బాక్స్ ఇష్టపడే వాళ్ళ లిస్ట్ లో పూజా ఒకటి.. భోజనం లిస్ట్ చెప్తుంటే మనకే నోరు ఊరుతుంది కదా !!

మరింత సమాచారం తెలుసుకోండి: