ప్రపంచ వ్యాప్తంగా జేమ్స్ బాండ్ 007 సిరీస్ లో వచ్చే సినిమాలకి, జేమ్స్ బాండ్ డేనియర్ క్రెగ్ కి ఎంత ఫేం ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జేమ్స్ బాండ్ సినిమా థియోటర్స్ లోకి వస్తుందంటే ఆఫీసులకి, కాలేజీలకు సెలవు పెట్టి మరీ వెళ్ళే అభిమానులు దేశ వ్యాప్తంగా కోట్లలో ఉన్నారు. అలాంటి జేమ్స్ బాండ్ 007 సిరీస్ లో ప్రతిష్టాత్మక 25వ సినిమా రెడీ అయింది. డేనియల్ క్రెగ్ హీరోగా నో టైమ్ టు డై పేరుతో సరికొత్త జేమ్స్ బాండ్ సినిమా ముస్తాబవుతుంది. ఈ సినిమాకు సంబంధించి థియోట్రికల్ ట్రైలర్ ని రీసెంట్‌గా విడుదల చేశారు.

 

జేమ్స్ బాండ్ సిరీస్ లో ఇది 25వ చిత్రమే కాకుండా.. నటుడు డేనియర్ క్రెగ్ కు ఇదే ఆఖరి బాండ్ సినిమా కూడా. ఈ సినిమాతో అతడి అగ్రిమెంట్ పూర్తవుతుంది. జేమ్స్ బాండ్ హీరోల్లో ఇతడు ఆరో హీరో. క్యాసినో రాయల్ తో 007గా మారిన డేనియర్, తాజా సినిమాతో కలుపుకొని ఇప్పటివరకు మొత్తం 5 జేమ్స్ బాండ్ సినిమాలు చేశాడు. ఇక లేటెస్ట్ జేమ్స్ బాండ్ సినిమా 'నో టైమ్ టు డై' ఇంతకుముందొచ్చిన బాండ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా తెరకెక్కిందనే విషయం ఈ సినిమా లేటెస్ట్ ట్రైలర్ చూస్తేనే అర్థమౌతుంది. ఉత్కంఠత కలిగించే బైక్ ఛేజ్ లతో పాటు బాండ్ స్పెషాలిటీ కారును కూడా ట్రైలర్ లో చిన్న సాంపిల్ చూపించారు. బాండ్ గర్ల్ తో పాటు కీలకమైన ఆర్టిస్టులందరూ ట్రైలర్ లో కనిపించారు. ఈ సినిమాను లండన్, జమైకా, నార్వే, ఇటలీ దేశాల్లో చిత్రీకరించారు.

 

2015 తర్వాత మళ్లీ జేమ్స్ బాండ్ సినిమా తెరపైకి రాలేదు. నిజానికి ఈ కొత్త సినిమా గతేడాదే రిలీజ్ కావాల్సింది. కానీ పైన్ వుడ్ స్టూడియోస్ లో జరిగిన భారీ అగ్నిప్రమాదం కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యమైందన్న విషయం తెలిసిందే. అంతేకాదు అదే ప్రమాదంలో డానియల్ క్రెగ్ కూడా గాయపడ్డంతో షూటింగ్ ఇంకాస్త లేట్ అయింది. దీంతో ఈ ఏడాది కూడా రిలీజ్ చేయలేకపోయారు. ఎట్టకేలకు ఏప్రిల్ లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. యూకే, ఇండియాలో ఏప్రిల్ 3న... అమెరికా, ఆస్ట్రేలియాలో ఏప్రిల్ 8న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ న్యూస్ తెలియగానే జేమ్స్ బాండ్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: