తొలిసారిగా వెంకటేష్ మరియు నాగచైతన్య కలిసి నటిస్తున్న కొత్త సినిమా వెంకీ మామ. యువ దర్శకుడు బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరియు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ల పై సురేష్ బాబు మరియు టిజి విశ్వప్రసాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో వెంకటేష్ కు జోడిగా రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా నాగ చైతన్యకు జోడిగా రాశి ఖన్నా నటిస్తోంది. 

 

ఇద్దరు మామ, అల్లుళ్ళ మధ్య భావోద్వేగాలతో కూడిన ఒక మంచి కథను బేస్ గా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించినట్లు నిన్న ఈ సినిమా మీడియా మీట్ సందర్భంగా దర్శకుడు బాబీ మాట్లాడుతూ చెప్పారు. అలానే సినిమాలో ఆడియన్స్ ఆశించే పలు ఎంటర్టైన్మెంట్ అంశాలు మరియు మాస్ ఫైట్స్ కూడా మిళితం అయి ఉన్నట్లు బేబీ చెప్పారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ మరియు మూడు సాంగ్స్ శ్రోతలను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై మంచి అంచనాలు పెంచేసింది. 

 

ఇక ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఫుల్ స్వింగ్ లో షురూ చేసింది సినిమా యూనిట్. అందులో భాగంగా నిన్న సినిమాలోని ప్రధాన తారాగణం పలు మీడియా ఛానల్స్ కు ఇంటర్వ్యూ లు ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎల్లుండి శనివారం ఖమ్మం లో ఎంతో వైభవంగా జరుగనుంది. ఈ సినిమా యూనిట్ సభ్యులతో పాటు పలువురు సినీ రంగ ప్రముఖులు పాల్గొనబోయే ఈ వేడుక కోసం ఎంతో భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఎన్నో అంచనాల మధ్య, తొలిసారిగా మామ అల్లుళ్ళు కలయికలో రానున్న ఈ సినిమా ఎంత మేర సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: