గత కొన్ని రోజులుగా భారత యువ క్రికెటర్ రిషబ్ పంత్ ప్రదర్శనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాలా మంది సీనియర్ ఆటగాళ్ళు సైతం పంత్ ఆటతీరు మార్చుకోవాలనీ లేకపోతే జట్టులో అతని స్థానం కష్టమవుతుందని హెచ్చరించారు. పంత్ స్థానంలో సంజూ సాంసన్ ని తీసుకోవాలనీ సలహాలు కూడా ఇస్తున్నారు. ప్రపంచ కప్ అనంతరం ధోనీ క్రికెట్ కి ఉంటున్న నేపథ్యంలో పంత్ ఆ స్థానానికి వచ్చాడు.

 

ధోనీ స్థానంలో వచ్చాడు కాబట్టి అతనిపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. అతడు ఆటలో విఫలమవుతున్న ప్రతీ సారి ధోనీని గుర్తు చేయడం వల్ల అతనిలో ఒత్తిడి రోజు రోజుకీ పెరుగుతుంది. అయితే భారత క్రికెట్ టీమ్ కెప్టెన్ మరోసారి పంత్ కి మద్దతుగా నిలిచాడు. శుక్రవారం నుంచి  ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో వెస్టిండీస్‌తో తొలి టీ20 నేపథ్యంలో ప్రి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పంత్‌పై విమర్శలపై స్పందించాడు. 

 

టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు పంత్‌పై పూర్తి నమ్మకం, విశ్వాసం ఉందని తేల్చిచెప్పాడు. మ్యాచ్‌లో పంత్‌ విఫలమైన ప్రతీసారి స్టేడియంలోని ప్రేక్షకులు ధోని ధోనీ అంటూ అరుస్తున్నారని, అలా అరవడం వల్ల ఒక ఆటగాడు ఎంత ఒత్తిడికి గురవుతాడో మీకు తెలియదని, అతడి ప్రదర్శన బాగుండాలంటే ఒత్తిడి లేకపోవడం చాలా అవసరం అందుకే ప్రేక్షకులు ముందుగా అలా అరవటం మానుకోవాలని సూచించాడు.

 

పంత్ పై మాకు పూర్తి విశ్వాసం ఉంది. అతడు మ్యాచ్‌ విన్నర్‌. అయితే అతడు విఫలమైన సందర్భంలో మనం అండగా నిలవాల్సి ఉంది.అతడు విఫలమైనపుడు మనం అండగా నిలిస్తేనే అతడిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అప్పుడే అతనిలోని ఆట బయటపడుతుందని చెప్పాడు. ప్రతీ ఒక్క ఆటగాడు దేశం కోసం ఆడేటపుడు క్రమశిక్షణతో ఆడతారని పేర్కొన్నాడు. మరి తనకి అండగా నిలిచిన కోహ్లీ మాటని పంత్ నిలబెట్టుకుంటాడా లేదా చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: