ఈ రోజుల్లో, బస్ స్టాప్ వంటి సినిమాలతో పాపులర్ అయిన దర్శకుడు మారుతి ఇప్పటి వరకు చాలా లైట్ సబ్జెక్ట్ లే తీసుకుని సినిమాలు చేస్తూ వచ్చారు. జానర్ ఏదైనా, ఈజీగా కామెడిని క్రియోట్ చేసి సక్సస్ కొట్టే టాలెంట్ పుష్కలంగా ఉంది. ప్రేమకథాచిత్రమ్, భలేభలే మగాడివోయ్, మహానుభావుడు ఇలాంటి సినిమాలే. అయితే ఫస్ట్ టైం మారుతి కాస్త టిపికల్ సబ్జెక్ట్ ను టేకప్ చేసాడు. మారిపోతున్న, ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మెటీరియలిస్టిక్ గా మారిపోతున్న మానవ సంబంధాల నేపథ్యంలో, చాలా సున్నితమైన మరణం అనే దాన్ని ఫన్ తో డీల్ చేయడం అన్నది మారుతి తీసుకున్న సబ్జెక్ట్. 

 

ప్రతిరోజూ పండగే అనే టైటిల్ తో రూపొందిన ఈ సినిమా థియోట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. క్యాన్సర్ ముదిరిపోయి, వారంలో చనిపోయే పెద్దాయిన. పూర్తిగా మెటీరియలిస్టిక్ గా మారిపోయిన కొడుకులు. తాత కోసం వచ్చిన మనవడు ఏం చేసాడు? తాతను ఎలా హ్యాపీగా వుంచాడు అన్నది లైన్ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్ కట్ విషయంలో మారుతి సక్సస్ అయినట్టేనని టాక్ వినిపిస్తోంది. ఈ రెండు నిమషాల ట్రైలర్ లో వున్న విషయాన్ని రెండు గంటల కథగా ఎలా చెప్పారు? అది కూడా ఓ మనిషి మరణం ముందు రోజులను పండగలా సెలబ్రేట్ చేసుకోవడం అన్నదాన్ని ఎలా కన్విన్సింగ్ గా చెప్పగలిగారు? కొడుకుల వైఖరి ప్రేక్షకుడికి సూటిగా గుచ్చుకోకుండా ఎలా డీల్ చేయగలిగారు? అన్నది ఇప్పుడు అందరు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.

 

వాస్తవంగా చెప్పాలంటే మారుతి చేసిన ఈ ఎక్స్‌పరిమెంట్..ఆయన టాలెంట్ కు ఈ సినిమా పరీక్షే. ఈ సినిమా గనక హిట్ అయితే ఇటువంటి ఎక్స్‌పరిమెంట్స్ మరికొన్ని చేయొచ్చు. కాకపోతే లైన్ అంత ఆసక్తికరంగా లేదే..అన్న టాక్ విసిపిస్తుండటంతో మారుతికి 'ప్రతిరోజూ పండగే' వర్కౌట్ అవుతుందా లేదా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రస్తుతం మారుతి కంప్లీట్ గా ఈ సినిమా మీదే దృష్ఠి పెట్టాడు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక గాని కొత్త సినిమా కి సంబంధించిన అప్‌డేట్ రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: