కార్తికేయ..ఆర్.ఎక్స్ 100 సినిమాతో ఇండస్ట్రీలోకి ఒక్కసారిగా దూసుకొచ్చాడు. హీరోయిన్ పాయల్ తన అందాలతో, మత్తెక్కించే నటనతో ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో అంతే కార్తికేయ ఆకట్టుకున్నాడు. ఈ సినిమా తర్వాత కార్తికేయ ఇండస్ట్రీలో సెటిలవడం పక్కా అని అందరు ఊహించారు. కానీ ఆ తర్వాత వచ్చిన హిప్పీ, గుణ 369 ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. అంతేకాదు నాని గ్యాంగ్ లీడర్ లో చేసిన నెగిటివ్ రోల్ కూడా కార్తికేయకు అసలు ఉపయోగపడలేదు. ఇక చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏమిటంటే కార్తికేయ మొదటి సినిమా ప్రేమతో మీ కార్తీక్ ఆర్.ఎక్స్ 100 కి ముందే వచ్చింది. కానీ ఈ సినిమా ఎవరికి గుర్తు లేదు. సో మొత్తంగా చూస్తే ఇప్పటి వరకు కార్తికేయ కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమా ఒక్క ఆర్.ఎక్స్ 100 మాత్రమే.

 

ఇక అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతున్న సమయంలో 90 ఎంఎల్ సినిమాకు పెద్ద చిక్కొచ్చి పడింది. విడుదలకు 48 గంటలు కూడా సమయం లేని టైం లో సెన్సార్ బోర్డు ఈ చిత్ర బృందాన్ని చాలా టెన్షన్ పెట్టేసింది. ఈ గురువారమే సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. మంగళ వారానికి సెన్సార్ క్లియరెన్స్ రాలేదు. సినిమాలో హీరో ప్రతి పూటా 90 ఎంఎల్ మందు కొడితే తప్ప బతక లేని పరిస్థితి లో ఉంటాడు. కారణం ఏదైనా సరే.. ఈ సినిమా మద్యపానాన్ని ప్రోత్సహించేలా ఉందన్న విమర్శలు మెండుగా వచ్చాయి. ఈ నేపథ్యం లోనే సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు చెప్పుకున్నారు.

 

90 ఎంఎల్ కి సెన్సార్ సర్టిఫికెట్ రావడం కష్టమే అని.. ఇప్పుడప్పుడే సినిమా రిలీజ్ కాక పోవచ్చని.. ఈ వారం అయితే పక్కాగా వాయిదా పడుతుందని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపించాయి. ఐతే ఇంతలోనే ఏం జరిగిందో ఏమో కానీ.. బుధవారం సాయంత్రం సినిమాకు లైన్ క్లియర్ అయింది. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేసి రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఐతే విడుదల విషయంలో డైలామాలో చిత్ర యూనిట్ ఉన్నారట. బుకింగ్స్ ఆపేసిన నేపథ్యం లో కొన్ని గంటల్లో విడుదలకు ఏర్పాట్లు చేయడం కష్టమని.. సినిమాను ఒక రోజు వాయిదా వేశారు. గురువారం కాకుండా శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇక ఈ సినిమాతో పాటు 'భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు' అశ్వమేధం లాంటి చిన్న సినిమాలు ఈ వారం అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. మరి వీటిలో ఏ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక కార్తికేయకి ఈ సినిమా హిట్ చాలా కీలకం. లేదంటే మళ్ళీ సినిమా చాన్స్ రావడం కష్టం. 

మరింత సమాచారం తెలుసుకోండి: